హలాల్ ఉత్పత్తులపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమం

0
1038

హలాల్ ఉత్పత్తులపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థ హిందూ జనజాగృతి సమితి ఉద్యమం మొదలుపెట్టింది. హలాల్ మాంసాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చింది. మాంసాన్ని హలాల్‌గా ధృవీకరించడం ద్వారా వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని, ఇది భారతదేశం ఇస్లామిక్ రాజ్యంగా మారడానికి మార్గం సుగమం చేస్తుందని హిందూ జనజాగృతి సమితి కర్ణాటక ప్రతినిధి
మోహన్ గౌడ ఒక వీడియోలో తెలిపారు. ఈ డబ్బు దేశానికి వ్యతిరేకంగా భారతదేశం మొత్తంలో దేశ వ్యతిరేక కుట్రలకు నిధులు సమకూరుస్తుందని గౌడ వాదించారు.

“హలాల్ మాంసం, హలాల్ ఉత్పత్తులను బహిష్కరించాలని, హిందూ వధ పద్ధతిని ఉపయోగించే ఝట్కా విధానాన్ని ఉపయోగించాలని మేము హిందువులందరినీ కోరుతున్నాము. ఇలాంటి దేశ వ్యతిరేక కార్యకలాపాల ఆర్థిక బహిష్కరణలో భాగస్వాములు అవుదాం’’ అని మోహన్ గౌడ ట్విట్టర్‌లో విడుదల చేసిన వీడియోలో కోరారు.

https://twitter.com/safaperaje/status/1508381684881756162

ఇస్లాం మతానికి సంబంధించిన పద్ధతులను ఉపయోగించి చేసిన హలాల్ మాంసాన్ని హిందూ దేవతలకు సమర్పించడం సరైనది కాదని హిందూ జనజాగృతి సమితి అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్‌మాత్ న్యూస్‌తో గౌడ మాట్లాడుతూ, “పలు సందర్భాల్లో హిందువులు మాంసం పెద్ద మొత్తంలో తీసుకువస్తారు. ఇస్లాం ప్రకారం హలాల్ ధృవీకరించబడిన మాంసాన్ని బహిష్కరించాలని మేము ప్రచారం చేసాము.. చేస్తున్నాం. ఎందుకంటే ఇస్లాం ప్రకారం ఇది మొదట అల్లాకు సమర్పించబడుతుంది. అలాంటి మాంసాన్ని హిందూ దేవుళ్లకు, దేవతలకు నైవేద్యంగా పెట్టకూడదు” అని వివరించారు. “ఒక ముస్లిం మనిషి ఏదైనా జంతువును చంపినప్పుడు, దానిని మక్కా వైపు చూపిస్తాడు. దానిని చంపేటప్పుడు నమాజ్ చేస్తారు. అటువంటి జంతువుల మాంసాన్ని హిందూ దేవతలకు సమర్పించకూడదు. హిందూమతంలో, జంతువులను వేధించకూడదని మేము విశ్వసిస్తాము, అందుకే మేము ఒకే షాక్ (ఝట్కా)లో అర్పిస్తూ ప్రాణాలను తీస్తుంటాము” అని అన్నారు.

ఇక చాలా మంది హిందూ కార్యకర్తలు, సంస్థలు ఆహార ఉత్పత్తులపై హలాల్ ధృవీకరణపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అక్టోబర్ 2021లో, శ్రీమతి.తుషార కేరళలో తొలిసారిగా హలాల్ లేని రెస్టారెంట్‌ను ప్రారంభించింది, ఆమె బ్రాంచ్ తెరవగానే ఇస్లామిక్ గూండాలు ఆమెపై దాడి చేసి బెదిరించారు. అదే సంవత్సరం ఏప్రిల్‌లో, హలాల్ లేని మాంసాన్ని విక్రయిస్తున్నందుకు కేరళకు చెందిన క్రైస్తవ వ్యక్తిపై దాడి చేశారు. అతని ఫుడ్ ట్రక్ ఈ సంఘటనలో దగ్ధమైంది.