More

    వ్యాపారాలు దెబ్బతింటాయి, ఎమర్జెన్సీ వాహనాలు నిలిచిపోతాయని చెప్పినా కూడా బహిరంగంగానే నమాజ్

    ఏప్రిల్ 3న ఆగ్రాలోని ఇమ్లీ వలీ మసీదు వెలుపల రోడ్డుపై నమాజ్ చేయడంపై హిందూ మహాసభ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మసీదు ఆగ్రాలోని గుర్ కీ మండిలో ఉంది. నమాజ్‌ను రోడ్డుపై కాకుండా మసీదు లోపలే నిర్వహించాలని హిందువులు కోరారు. అయినా కూడా వారు వినిపించుకోలేదు.

    హిందూ మహాసభ జిల్లా అధినేత రోనక్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ, నమాజ్ సమయంలో ముస్లింలు దుకాణాలను నడపనివ్వరని అన్నారు. వారు రహదారిపై అడ్డుగా ఉంటారని, అంబులెన్స్‌ల వంటి అత్యవసర వాహనాలు కూడా తరచుగా ఇరుక్కుపోతున్నాయని ఆయన తెలిపారు. “దుకాణదారులు ముందుగానే దుకాణాలను మూసివేసి తమ వాహనాలను రహదారి నుండి దూరంగా తరలించాలి. ఎవరైనా వాహనాన్ని సకాలంలో తొలగించకపోతే, పోలీసులకు ఫోన్ చేసి దుకాణదారుపై చలాన్ జారీ చేయిస్తారు” అని అన్నారు. పోలీసు అధికారులు వచ్చి హిందూ సంఘాల నిరసనను ఆపాలని కోరారు. ట్రాఫిక్ లో కదలిక ఉండేలా రహదారికి ఒక వైపు మాత్రమే నమాజ్ చేసుకోనివ్వాలని సూచించారు.. మిగిలిన రోడ్డు మీద వాహనాలు వెళ్లేందుకు అవకాశం ఉండేలా చూడాలని పోలీసులు ముస్లిం సమాజాన్ని కోరారు. రోడ్డుకు ఒకవైపు మాత్రమే నమాజ్ చేయనివ్వడానికి మిగిలిన వారు అంగీకరించారు. నిబంధనలను పాటించడంలో విఫలమైతే, హిందూ సంఘాలు నిరసనను పునఃప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. దుకాణదారులకు, ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగించడాన్ని అసలు ఒప్పుకోమని హిందూ సంఘాలు తేల్చి చెప్పాయి. రోడ్డుపై నమాజ్‌ చేసినప్పుడు, హనుమాన్‌ చాలీసా పఠించేందుకు ఎందుకు అనుమతించరని హిందూ మహాసభ అధికార ప్రతినిధి సంజయ్‌ జాట్ ప్రశ్నించారు.

    ‘ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది’ : పోలీసులు
    సిటీ ఎస్పీ వికాస్ కుమార్ మాట్లాడుతూ పరిస్థితి అదుపులో ఉందని, ఈ విషయంపై ఇరు వర్గాల మధ్య సమస్య సామరస్యంగా పరిష్కరించబడిందని అన్నారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు పోలీసులు ఎవరినీ అనుమతించబోరని ఎస్‌ఎస్‌పీ సుధీర్‌ కుమార్‌ సింగ్‌ చెప్పుకొచ్చారు. హిందూ, ముస్లిం పండుగలు శాంతియుతంగా జరుపుకునేలా పోలీసులు చూస్తారని ఆయన అన్నారు.

    ‘గత 40 ఏళ్లుగా నమాజ్‌ను చేస్తున్నాం ఇక్కడే’ – ముస్లిం సమాజం
    గత 40 ఏళ్లుగా తాము మసీదు వెలుపల నమాజ్ చేస్తున్నామని, అందుకు స్థానిక అధికారుల నుంచి అనుమతి ఉందని ముస్లిం సంఘాల నాయకులు తెలిపారు. ఇక్కడ ప్రతిరోజూ సాయంత్రం నమాజ్ సమయంలో ప్రార్థనలు చేయడానికి సుమారు 10,000 మంది ముస్లింలు సందర్శిస్తారు. గతంలో నమాజ్ చేయడంపై ఎలాంటి వివాదాలు లేవని, సెయింట్ జాన్స్ చర్చి, SN మెడికల్ కాలేజీ తమ ప్రాంగణంలో నమాజ్, పార్కింగ్ కోసం స్థలాన్ని అందించడం ద్వారా తమకు మద్దతునిచ్చాయని తెలిపారు. ఆగ్రాలోని హిందువులు మరియు ముస్లింల మధ్య సోదరభావానికి మసీదు చిహ్నం అని భారతీయ ముస్లిం వికాస్ పరిషత్ ఛైర్మన్ సమీ అఘై మీడియాకు తెలిపారు.

    Trending Stories

    Related Stories