More

    భారీ వరదల్లో కూడా హిందూ బాలికలు, యువతులపై అత్యాచారాలు..!

    పాకిస్థాన్ ను ఓ వైపు భారీగా వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. మరో వైపు అలాంటి సమయాల్లో కూడా హిందూ బాలికలపై అత్యాచారాలు చేస్తున్నారు. పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్‌లో భారీ వరదల మధ్య కూడా.. హిందువులను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. కిరాణా వస్తువులు, ఆహారం అందిస్తామనే నెపంతో వరద బాధిత ప్రాంతంలో ఇద్దరు పాకిస్థానీ ముస్లింలు ఒక యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఇద్దరు నిందితులను ఆటో రిక్షా డ్రైవర్‌ ఖలీద్‌ గా, దిల్‌షేర్‌గా గుర్తించారు. వీరిద్దరూ బాధిత మహిళకు మత్తు మందు ఇచ్చి రెండు రోజుల పాటు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన సింధ్ ప్రావిన్స్‌లోని సంఘర్ జిల్లా షహదాద్‌పూర్‌లో జరిగినట్లు సమాచారం.

    ఆ మహిళ తన దుస్థితిని వివరిస్తూ తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. నిందితుడు ఆటో రిక్షా డ్రైవర్ తనను మోసగించాడని, కిరాణా సామాను ఇస్తానని చెప్పాడని ఆమె వాపోయింది. “అతను నన్ను తీసుకెళ్లి విషపూరితమైన పదార్ధం తినిపించి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత కూడా పలు మార్లు ఖలీద్, దిల్షేర్ అత్యాచారం చేసి వదిలేశారు” అని ఆమె చెప్పుకొచ్చింది.

    పాక్ లో నివసిస్తున్న హిందూ ప్రజలు ఎన్నో ఇబ్బందులను, వివక్షను ఎదుర్కొంటున్నారు. సింధ్ ప్రావిన్స్‌లో ఇటీవల వరదల సమయంలో వారి పరిస్థితి మరింత దిగజారింది. ఆగస్టు 31న, పాకిస్థాన్ నుండి ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్కడ ఒక గూండా హిందూ మహిళలపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేశారు.

    ఇటీవలే సింధ్‌లో 8 ఏళ్ల హిందూ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. సింధ్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న చాలా మంది హిందువులు పాక్ సమాజంలోని అత్యంత పేద వర్గాలకు చెందిన వారు. వారి భూముల ఆక్రమణ, అపహరణ, మత మార్పిడికి సంబంధించిన ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మానవ హక్కుల ఉల్లంఘనలను ఎదుర్కొంటున్నారు. వారికి తక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. చాలా మంది ఇప్పటికీ ముస్లిం భూస్వాముల కింద కార్మికులుగా జీవిస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ధైర్యం చేయరు. ప్రస్తుతం పాక్ లోని దక్షిణ ప్రాంతంలో వరదలు బీభత్సం సృష్టించి 1100 మందికి పైగా మృతి చెందారు. సింధు నది ఉగ్రంగా ప్రవహిస్తోంది.

    spot_img

    Trending Stories

    Related Stories