More

  తాగడానికి మసీదు నుండి నీళ్లు తెచ్చుకున్న హిందూ కుటుంబానికి టార్చర్ చూపించారు

  పాకిస్తాన్ లో హిందువుల పట్ల ఎన్ని దారుణాలు చోటు చేసుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది హిందువులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. మైనార్టీలకు రక్షణ కల్పిస్తామని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఓ వైపు పెద్ద పెద్ద మాటలు చెబుతున్నా అవన్నీ అబద్ధాలేనని అక్కడ జరుగుతున్న ఘటనలను బట్టి మనకు స్పష్టంగా తెలిసిపోతూ ఉంది. ప్రతీ రోజూ హిందూ కుటుంబాలపైనా, హిందూ మహిళల పైనా ఎన్నో రకాల దారుణాలకు సంబంధించిన వార్తలు మనం వింటూనే ఉన్నాం. తాజాగా మసీదు దగ్గర నుండి నీళ్లు తెచ్చుకున్న హిందూ కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేసిన ఘటన అక్కడ చోటు చేసుకుంది.

  పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని మసీదు నుండి తాగునీటిని మైనారిటీ హిందూ సమాజానికి చెందిన ఓ పేద రైతు కుటుంబం తెచ్చుకోవడం వారిని ఇబ్బందులకు గురిచేసింది. కొందరు వ్యక్తులు తమ ప్రార్థనా స్థలాన్ని అపవిత్రం చేశారు అంటూ వారిని హింసించి, బంధీలుగా చేసుకున్నారని పాక్ మీడియా సంస్థలు తెలిపాయి. ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉన్న తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీకి చెందిన వాళ్ళే తమపై దాడి చేశారని ఆ కుటుంబం ఆరోపించింది.

  పంజాబ్‌లోని రహీమ్యార్ ఖాన్ నగర నివాసి అయిన ఆలం రామ్ భీల్ తన భార్యతో సహా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి పత్తిని పండిస్తూ ఉన్నాడు. తాగునీటిని తీసుకురావడానికి సమీపంలోని మసీదు దగ్గరకు వెళ్లి ట్యాప్ లో నీటిని పట్టుకోడానికి కుటుంబ సభ్యులు వెళ్లారు. దీన్ని కొంతమంది స్థానికులు చూసి వారిని కొట్టారు. అక్కడితో ఆగని ఆ వ్యక్తులు ఆ కుటుంబం ఇంటికి తిరిగి రాగానే వారిని బంధించి హింసించడం మొదలు పెట్టారు. మసీదును అపవిత్రం చేస్తారా అంటూ ఇమ్రాన్ ఖాన్ పార్టీకి చెందిన వ్యక్తులు ఆ కుటుంబాన్ని తీవ్రంగా హింసించారు. అధికార పార్టీ సభ్యులు కావడంతో దాడి చేసినవారిపై పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆలం రామ్ భీల్ చెప్పారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆలం రామ్ భీల్ మరో వ్యక్తి పీటర్ జాన్ భీల్‌తో కలిసి పోలీస్ స్టేషన్ వెలుపల నిరసనను చేపట్టాడు. ఇతర మైనారిటీ నాయకులతో కలిసి చర్చించాలని ప్రయత్నించినా అధికార పార్టీ బెదిరింపుల కారణంగా ఎవరూ ముందుకు రాలేదని పీటర్ జాన్ భీల్ తెలిపారు. అయితే కొందరు నాయకుల మద్దతు కూడగట్టి ఎట్టకేలకు కేసు నమోదయ్యేలా చేశారు.

  PTI యొక్క దక్షిణ పంజాబ్ మైనారిటీ విభాగం సెక్రటరీ జనరల్ యోధిస్టర్ చోహాన్ ఈ సంఘటన తనకు తెలిసిందని, అయితే అధికార పార్టీ ఎంపీ జోక్యం కారణంగా తాము దూరంగా ఉన్నామని తెలిపారు. జిల్లా పోలీసు అధికారి అసద్ సర్ఫరాజ్ మాట్లాడుతూ ఈ విషయంపై తాము విచారణ మొదలు పెట్టామని తెలిపారు. సీనియర్ న్యాయవాది ఫరూఖ్ రిండ్ మాట్లాడుతూ భీల్స్ ప్రజలు నివసిస్తున్న బస్తీ కహూర్ ప్రాంతానికి చెందినవాడినని తెలిపారు. ఒక శతాబ్దానికి పైగా భీల్స్ కుటుంబాలు ఆ ప్రాంతం లో నివసిస్తున్నారు. ఆ వంశంలోని చాలా మంది వ్యవసాయ కార్మికులు, అత్యంత పేదలు అని ఆయన అన్నారు. ఫిర్యాదుదారు కుటుంబానికి ఉచిత న్యాయ సాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

  పాకిస్తాన్‌లో హిందువులు అతిపెద్ద మైనారిటీ కమ్యూనిటీగా ఏర్పడ్డారు. అధికారిక అంచనాల ప్రకారం, 75 లక్షల మంది హిందువులు పాకిస్తాన్‌లో నివసిస్తున్నారు. అయితే దేశంలో 90 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు. పాకిస్తాన్ హిందూ జనాభాలో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్‌లో స్థిరపడ్డారు. పాకిస్తాన్ ఏర్పడినప్పటి నుండి అక్కడ హిందువుల సంఖ్య భారీగా తగ్గుతూ వచ్చింది. హిందువులపై వేధింపులు కూడా ఎక్కువవుతూ వస్తున్నాయి.

  Trending Stories

  Related Stories