More

    హైదరాబాద్ లో ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయితో వెళుతోందని ..!

    ఇటీవలి కాలంలో ముస్లిం మహిళలను బైక్ లపై తీసుకుని వెళుతున్న హిందూ యువకులపై దాడులు చేస్తున్న ఘటనలు పలు ప్రాంతాల్లో చోటు చేసుకుంటూ ఉన్నాయి. తాజాగా అదే తరహా ఘటన మరోసారి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. టూవీలర్ పై వెళుతున్న ఓ యువతి, యువకుడిని ఆపిన స్థానికులు.. హిందూ యువకుడిపై దాడి చేశారు.

    హిందూ అబ్బాయిలతో ముస్లిం అమ్మాయిలు ప్రయాణించకుండా చేయడానికి వీధుల్లో కొందరు యువకులు మోరల్ పోలీసింగ్ చేస్తూ ఉన్నారు. కొందరు యువకులు వికృత చేష్టలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఇలాంటి మరో ఘటన చోటు చేసుకుంది. ఒక హిందూ యువకుడు తన ద్విచక్ర వాహనంపై ముస్లిం యువతితో వెళ్తున్నందుకు కొంతమంది దాడి చేసి మరీ కొట్టారు. యువతీ యువకులను ఓ ముస్లిం వ్యక్తి అడ్డుకున్నాడు. తరువాత మరికొందరు కూడా అతనితో కలిసి యువకుడిని కొట్టారు.డీసీపీ వెస్ట్ జోన్ కూడా ఈ ఘటన గురించి చెప్పారు. ఈ సంఘటన మూడు రోజుల కిందట చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వెబ్‌సైట్లలో వైరల్ అవుతూ వచ్చింది. నిందితుడిని అరెస్టు చేశామని, అతనిపై భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈ దాడికి పాల్పడ్డ ఇతరులను గుర్తించడానికి నిందితులను విచారించడం జరుగుతోందని పోలీసులు స్పష్టం చేశారు. టోలీ చౌకి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

    తెలంగాణలో వరుసగా జరుగుతున్న ఘటనలు:

    హిందూ యువకులతో ముస్లిం మహిళలను చూస్తే చాలు దాడులు చేస్తున్న ఘటనలు తెలంగాణాలో ఇటీవలి కాలంలో చాలానే జరిగాయి. హిందూ యువకులను బహిరంగంగా ఎగతాళి చేయడమే కాకుండా హిందూ పురుషులను కూడా దారుణంగా కొట్టారు. ఒక హిందూ దళిత వ్యక్తిని ముస్లిం మహిళతో బైక్ పై వెళ్లినందుకు ముస్లిం వ్యక్తుల బృందం కిడ్నాప్ చేసి, కొట్టారు. స్థానిక ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు జోక్యం చేసుకోవడంతో అతను తరువాత విడుదలయ్యాడు. అతని సోదరుడు, స్థానిక నాయకులు మద్దతు ఇచ్చిన తర్వాత మాత్రమే అతడిని కిడ్నాప్ చేసిన ముస్లిం వ్యక్తులపై కేసు నమోదు చేయగలిగాడు.

    బెంగళూరులో కూడా ఇలాంటి ఘటనే:

    బుర్ఖా వేసుకున్న మహిళను బైక్ పై ఎక్కించుకున్నాడని హిందూ వ్యక్తిపై దాడి చేసిన ఘటన బెంగళూరు నగరంలో కొద్దిరోజుల కిందట చోటు చేసుకుంది. ఓ ముస్లిం మహిళ హిందూ వ్యక్తితో వెళుతుండగా ఓ గ్రూపు వారిని అడ్డుకుంది.. ఆ తర్వాత ఆ యువతిని తిట్టడం దగ్గర నుండి.. మరో ఆటోలో ఎక్కించే వరకూ జరిగింది. బైక్ నడుపుతున్న వ్యక్తిని కొందరు వ్యక్తులు కొట్టడం కూడా చూడొచ్చు. ట్విట్టర్‌లో హేట్ పెట్రోల్ స్క్వాడ్ అనే అకౌంట్ షేర్ చేసిన వీడియోలో, గుంపులోని వ్యక్తులు హిందూ వ్యక్తిని బెదిరించడం, ముస్లిం మహిళను బురఖాతో ఇలా వెళ్లకూడదని తిట్టడం కూడా చేశారు. ముస్లిం మహిళ కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు తీసుకుని.. ఇలా ఎలా పంపిస్తారు అంటూ విమర్శలు గుప్పించారు. హిందూ పురుషుడితో ప్రయాణించినందుకు ఆమెను తిట్టి.. ఆటో ఎక్కించి పంపించి వేశారు. “హిందూ వ్యక్తితో ప్రయాణించడం మీకు సిగ్గు లేదా? ఈ రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఉందో మీకు తెలియదా? వీళ్లతో బయటకు వెళ్లవద్దని మేము మీ అందరినీ అభ్యర్థిస్తున్నాము, కానీ ఇప్పటికీ బైక్‌పై కూర్చుని అతనితో ప్రయాణిస్తున్నావు. మేము మీ గురించి ఆందోళన చెందము. మేము బురఖా గురించి ఆందోళన చెందుతున్నాము. బురఖా ధరించిన ఒక మహిళ ఇలా రైడ్ చేయడం చూసి ప్రజలు ఏమి అనుకుంటారు” అని ఓ వ్యక్తి అరవడం మొదలు పెట్టాడు. సోషల్ మీడియాలో షేర్ చేయబడిన వీడియోపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చాలా వేగంగా స్పందించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలియజేశారు. మహిళతో పాటు ప్రయాణిస్తున్న బైక్ రైడర్‌పై దాడి చేసిన కేసులో బెంగళూరు సిటీ పోలీసులు వేగంగా వ్యవహరించారని ఆయన అన్నారు. కేసు నమోదు చేసి, నిందితులపై చట్టపరమైన చర్యలు ప్రారంభించామని ఆయన ట్వీట్ చేశారు.

    Related Stories