National

నిబంధనలను ఉల్లంఘించి చర్చి నిర్మాణం.. నిరసన తెలియజేసిన హిందూ సంఘాల నేతల అరెస్టు

అక్రమంగా.. నిబంధనలను ఉల్లంఘించి చర్చిని నిర్మించారు. ఇది తప్పని చెబుతూ హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. అయితే పోలీసులు నిరసన తెలిపిన హిందూ సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్యాకుమారి జిల్లాలోని కల్కులం తాలూకాలోని మాథుర్ అక్విడక్ట్ సమీపంలో ఇటీవల అనుమతులు లేకుండా చర్చిని నిర్మించారు. ఈ చర్చిని తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలతో సహా పలువురు హిందూ కార్యకర్తలు కన్యాకుమారి పరిపాలన భవనం ఎదురుగా నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమాల్లో 300 మందికి పైగా హిందూ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్, హిందూ మున్నాని సభ్యులు, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు. అంతేకాకుండా అక్రమ చర్చిని తొలగించాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని 50 ప్రాంతాల్లో రాస్తా రోకోలు చేపట్టారు. శనివారం నిర్వహించిన నిరసనలలో నాగర్‌కోయిల్ బీజేపీ ఎమ్మెల్యే ఎంఆర్ గాంధీ, బీజేపీ కన్యాకుమారి జిల్లా అధ్యక్షుడు ధర్మరాజ్ కూడా పాల్గొన్నారు.

అనుమతి లేకుండా చర్చిని చట్టవిరుద్ధంగా నిర్మించారని స్థానికులు ఆరోపించారు. వేణుగోపాల్ కమిషన్ నివేదిక ప్రకారం, మండైకాడు మత అల్లర్ల తరువాత ప్రైవేట్ భూమి లేదా ప్రభుత్వ భూముల్లో చర్చిని నిర్మించకూడదని హిందూ కార్యకర్తలు తెలిపారు. క్రైస్తవ మిషనరీలు రహస్యంగా అద్దెకు ఉన్న భవనాన్ని స్వాధీనం చేసుకుని ఆ తరువాత “శిలువ” ను నిర్మించారని వారు ఆరోపించారు. “కొన్నిసార్లు, వారు అనుమతి లేకుండా ఒక భవనాన్ని నిర్మిస్తారు. సంవత్సరాల పాటూ విద్యుత్ కనెక్షన్ లేకుండా పనిచేస్తారు. తరువాత, వారు తమ పలుకుబడిని ఉపయోగించుకుని.. చర్చిని నిర్మిస్తారు. జిల్లాలో ఇలా వందలాది చర్చిలు ఉన్నాయి ”అని హిందూ సంఘాలు ఆరోపించాయి. నిరసన తీవ్రతరం కావడంతో, బిజెపి ఎమ్మెల్యే, పలువురు ప్రముఖ కార్యకర్తలతో సహా హిందూ నాయకులను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన నాయకులను తరువాత సాయంత్రం విడుదల చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే ఎంఆర్ గాంధీతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధర్మరాజ్, ఆర్ఎస్ఎస్ నాయకుడు రాజేంద్రన్, హిందూ మున్నానికి చెందిన మీసా సోమన్, ఇతర హిందూ కార్యకర్తలు సబ్ కలెక్టర్ తో సంప్రదింపులు జరిపారు. కొత్త చర్చిని నిర్మించడానికి అనుమతి ఇవ్వలేదని సబ్ కలెక్టర్ చెప్పారు. హిందూ సంఘాల కార్యకర్తలు భవనం దగ్గరకు చేరుకోగా.. ఆ నిర్మాణాన్ని టార్పాలిన్ చేత కవర్ చేశారని గుర్తించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seven − 3 =

Back to top button