More

  సద్దాంను పోలిన రాహుల్..! హిమంత బిశ్వశర్మ షాకింగ్ కామెంట్స్..!!

  పక్కనున్న ఫోటోను చూశారా..? ఈ ఫోటోలో ఉన్నది ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్. అయితే ఈ ఫోటోను ఒక్కసారి చూడండి. ఏంటి ఒకే ఫొటోలు చూపించి కన్ఫ్యూజ్ చేస్తున్నారా..? అని కోపం తెచ్చుకోకండి. ఇంకాస్త పరిశీలిచి చూడండి. ఆ.. ఎస్.. అర్థమైంది కదా..! అచ్చు సద్దాం హుస్సేన్ లాగానే ఉన్న మన ఉన్న రాహుల్ గాంధీ. భారత్ జోడో యాత్ర కోసం రాహుల్ రగిలించిన సెంటిమెంట్ గెటప్ ఇది. అయితే, గెడ్డంతో జనాన్ని ఆకర్షించేందుకు చేసిన ప్రయోగం కాస్త బెడిసికొట్టింది. రాహుల్ గెడ్డం కాస్తా ఇరాక్ నియంతను తలపిస్తోంది. తాజాగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా రాహుల్ గెడ్డంపై తనదైన శైలిలో స్పందించారు. రాహుల్ గాంధీ గెడ్డం పెంచి సద్దాం హుస్సేన్ లాగా తయారయ్యారనీ, ఒక వేళ రాహుల్ గాంధీ తన రూపురేఖలు మార్చుకోవాలనుకుంటే నెహ్రూలానో, సర్దార్ పటేల్ లాగానో మార్చుకుంటే బావుంటుందని సెటైర్ వేశారు. అంతేగానీ, ఇలా తన స్టైల్ మార్చుకుని సద్దాం హుస్సేన్ లాగా కనిపించడమే అసలు సమస్య అని వ్యాఖ్యానించారు.

  గుజరాత్‎లో డిసెంబర్ 1, 5 తేదీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. రెండో విడత ఎన్నికల ప్రచారం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్లందరూ విస్త్రుతంగా ప్రచారం చేశారు. కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలూ గుజరాత్ లో విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే ఈ ప్రచారంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మాజీ కాంగ్రెస్ నాయకులు కావడంతో హస్తం పార్టీ లొసుగులన్నీ తెలిసిన వ్యక్తి. దీంతో సమయం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీని ఒక ఆట ఆడుకున్నారు. రాహుల్ గాంధీ గెడ్డం నుంచి కాంగ్రెస్ పార్టీలో నాయకులకు ఉన్న విలువ వరకు ప్రతి విషయాన్నీ తిప్పికొడుతూనే వచ్చారు. బీజేపీ ప్రభుత్వం త్వరలో తీసుకొస్తున్న చట్టాలను కూడా ప్రస్తావిస్తూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‎ గా నిలిచారు.

  ముందుగా కాంగ్రెస్ కు కొత్తగా ఎన్నికైన వృద్ద అధ్యక్షుడు మల్లి ఖార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. గుజరాత్ లోని ఎన్నికల్లో మల్లి ఖార్జున ఖర్గే దేదియాపాద అనే గిరిజన మెజార్గీ నియోజకవర్గంలో ఓ ప్రచార సభలో పాల్గొన్నారు. ఆ సభలో నరేంద్ర మోదీ తాను ఛాయ్ అమ్ముకుని తిరిగానని చెప్పుకుంటారనీ,.. అయితే మోదీ ఛాయ్ అమ్మితే తాగేవారున్నారనీ అదే తమలాంటి నిమ్నకులాల వారు ఛాయ్ అమ్మినా తీసుకోరన్నారు. తనతో ఎవరూ టీ కూడా తాగేందుకు ఆసక్తి చూపరని ఎన్నికల సభలో చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలను హిమంత బిశ్వ శర్మ అంతే దీటుగా సమాధానమిచ్చారు. మల్లిఖార్జున ఖర్గేతో రాహుల్ గాంధీ ఎప్పుడూ టీ తాగలేదేమో.. అందుకే ఆయన అంతగా బాధపడుతున్నట్లున్నారని చెప్పారు. ఒకవేళ మల్లి ఖార్జున ఖర్గేతో రాహుల్ గాంధీ గతంలో ఎప్పుడైనా టీ తాగిఉంటే ఆ ఫోటోను చూపాలని కూడా సవాల్ చేశారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మల్లిఖార్జున ఖర్గేకు ఇటువంటి మాటలను అనే హక్కు లేదని తెలిపారు.

  కాంగ్రెస్ పార్టీలో కుక్కలకు ఉన్న విలువ కూడా నాయకులకు ఉండదనీ హిమంత బిశ్వ శర్మ అన్నారు. అయితే ఈ మాటల వెనుక గతంలో తాను అనుభవించిన అవమానాలను గుర్తు చేసుకునే ఈ వ్యాఖ్యలు చేసినట్లు పలువురు భావిస్తున్నారు. 2016లో అస్సాంలోని ముఖ్య కాంగ్రెస్ నాయకులందరూ తమ సమస్యలను చెప్పుకునేందుకు రాహుల్ గాంధీని కలిశారు. ఈ నేతల్లో మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కూడా ఉన్నారు. వీరితో పాటు హిమంత బిశ్వ శర్మ కూడా వెళ్ళారు. అయితే ఆ సమయంలో మాట్లాడుతుండగా వారు తినే బిస్కట్లను రాహుల్ గాంధీ కుక్క వచ్చి తినింది. దీన్ని చూసిన రాహుల్ గాంధీ నవ్వి ఊరుకున్నాడు. అయితే కుక్క నాకిన ప్లేట్ లోని బిస్కట్లను రాహుల్ గాంధీ చేంజ్ చేయించడం కూడా చేయలేదు. అక్కడికొచ్చిన తరుణ్ గొగోయ్ తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా అవే బిస్కట్లను తిన్నారు. దీంతో అటువంటి సమావేశాలకు కొత్తగా వచ్చిన హిమంత బిశ్వ శర్మ ఈ ధోరణిని చూసి ఆశ్చర్యపోయినట్టు తెలిపారు. అయితే దీని తర్వాత ఇది ఇక్కడ సర్వసాధారణమని అర్థమైందని హిమంత ఓ ఇంటర్యూలో అన్నారు. అందుకే తాజా ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ పార్టీలో మనుషుల కంటే కుక్కలకే ఎక్కువ విలువ ఉంటుందని వ్యాఖ్యలు చేశారు.

  దీంతో పాటు ఈ ఎన్నికల్లో దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు హిమంత బిశ్వశర్మ. కొద్దిరోజుల క్రితం వెలుగుచూసిన శ్రద్దా వాకర్ లవ్ జీహాద్ ఉదంతంపై స్పందిస్తూ లవ్ జీహాద్ పై చట్టం తీసుకురావాలని కోరారు. దేశంలో ఇటువంటి కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయనీ దీనిపై చట్టం తీసుకొచ్చి కట్టడి చేయాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పరిపాలించినంత వరకూ లవ్ జీహాద్ కు అనుకూలంగా వ్యవహరించారని తెలిపారు. అందుకే ముంబైలో శ్రద్దా వాల్కర్ ఎన్నిసార్లు కంప్లెయింట్ ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. శ్రద్దా వాల్కర్ ముంబైలో నివసిస్తున్న సమయంలో ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం పాలిస్తుండేదనీ అందుకే లవ్ జీహాద్ విషయాలను అంతగా పట్టించుకునేవారు కాదని తెలిపారు. అయితే బీజేపీ ప్రభుత్వం ఎప్పటికైనా లవ్ జీహాద్ పై చట్టం చేసితీరుతుందని వ్యాఖ్యానించారు. ఇటువంటి చట్టాలను చేయడం కేవలం ప్రధాని మోదీకే సాధ్యమని వ్యాఖ్యానించారు. దీంతో పాటు యూనిఫాం సివిల్ కోడ్ పై కూడా హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టంపై ప్రజలకు సానుకూల స్పందన ఉందన్నారు. మహిళలకు జవహర్ లాల్ చేసిన అన్యాయాన్ని యూసీసీ తో ముగింపు పలకొచ్చని తెలిపారు. త్వరలో మోదీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురాబోతోందన్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, పదిమందికీ షేర్ చేయండి. నేషనలిస్ట్ హబ్ గ్రూపాఫ్ ఛానెళ్లను సబ్ స్క్రయిబ్ చేసుకుని.. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి.

  Trending Stories

  Related Stories