National

ఉత్తర భారతంపై వరుణుడి పంజా.. పిడుగులు పడి 68 మంది మృతి

ఉత్తర భారతదేశంలో వర్షాలు పడుతూ ఉండడంతో కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉన్నట్లుండి వరదలు రావడం, పిడుగులతో కూడిన వర్షాలు అధికారులను టెన్షన్ పెడుతూ ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలను వరదలు ముంచెత్తాయి. నగరంతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలలో ఒక్కరోజులోనే 300 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు చెబుతున్నారు. కుంభవృష్టికి భాగ్సు నాగ్ నాలా ఉప్పొంగి నగరంలోకి వరద నీరు ముంచెత్తింది. వరద ధాటికి పలు ఇళ్లు కూలిపోయాయి. పారిశుద్ధ్య కార్మికుల గుడారాలు కొట్టుకుపోయాయి. పలు కార్లు వరదల్లో కొట్టుకుపోయాయి. ఎక్కడ చూసినా బురద మయంగా మారింది. ఢిల్లీ, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు. మాంఝీ నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో గుడిసెలు, దుకాణాలు నాశనమయ్యాయి. సిమ్లా జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడడంతో దారి మూసుకుపోయింది. భాగ్సు నాగ్ ప్రాంతంలో వందలాది మంది వరదల్లో చిక్కుకుని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ధర్మ‌శాల వద్ద కుంభ‌వృష్టి కురుస్తోంది. ఆక‌స్మిక వ‌ర‌ద‌లు వ‌చ్చి కార్లు కొట్టుకుపోయాయి. కొన్ని హోట‌ళ్లు ధ్వంస‌మ‌య్యాయి. గ‌త కొన్ని రోజులుగా హిమాచ‌ల్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రానున్న రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో కుర‌వ‌నున్నట్లు వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఇప్ప‌టికే ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాత్రి మొత్తం కుంభ‌వృష్టి కుర‌వ‌డంతో అక్క‌డి ప్ర‌ధాన నదుల్లో నీటిమ‌ట్టాలు పెరుగుతున్నాయి.

ఇక పిడుగులు పడి మూడు రాష్ట్రాల్లో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ లో 41 మంది, రాజస్థాన్ లో 20 మంది, మధ్యప్రదేశ్ లో ఏడుగురిని పిడుగులు కబళించాయి. యూపీలోని ప్రయాగ్ రాజ్ జిల్లాలోనే 14 మంది పిడుగుపాటుతో మరణించారని అధికారులు వెల్లడించారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిహారం ప్రకటించారు. రాజస్థాన్ రాజధాని జైపూర్ లోని 12వ శతాబ్దం నాటి ఆమిర్ ప్యాలెస్ పై కూడా పిడుగు పడింది. ఆ కోటలోని వాచ్ టవర్ పైకి ఎక్కిన పర్యాటకులు పిడుగుపాటుకు గురయ్యారు. దీంతో 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. పిడుగుపడిన సమయంలో టవర్ పై 27 మంది దాకా ఉన్నారని, చాలా మంది గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మధ్యప్రదేశ్ లోని షియోపూర్, గ్వాలియర్, శివపురి జిల్లాల్లో పిడుగుపాటుకు ఏడుగురు మరణించారు.ఈ మరణాల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ నుంచి సాయం అందజేస్తామని చెప్పారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ప్రధాని.. వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయం చేస్తామన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

9 + eighteen =

Back to top button