More

  మొదట హిజాబ్.. తర్వాత కితాబ్(పుస్తకాలు).. అంటూ వెలసిన బ్యానర్లు

  కర్ణాటక బురఖాల వివాదం ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు కూడా పాకింది. 2022 ఫిబ్రవరి 8వ తేదీ మంగళవారం సాయంత్రం మహారాష్ట్రలోని బీడ్ నగరంలో బురఖాకు మద్దతుగా బ్యానర్‌లు వెలిశాయి. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అర్థరాత్రి బ్యానర్లను తొలగించారు. ఈ ఘటనలో విచారణ నిమిత్తం ఏఐఎంఐఎం స్థానిక విద్యార్థి నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం అతడిని విడుదల చేశారు.

  బషీర్ గంజ్ చౌక్, శివాజీ మహారాజ్ చౌక్, రాజురివేస్ కాంప్లెక్స్, బీడ్‌ ప్రాంతాలలో హిజాబ్‌కు మద్దతు ఇచ్చే బ్యానర్‌లు ఉంచారు. బ్యానర్‌లపై “పహ్లే హిజాబ్, ఫిర్ కితాబ్”(మొదట హిజాబ్.. ఆ తర్వాత పుస్తకం) అని.. “హిజాబ్ మా హక్కు” అని రాసి ఉంది. “హర్ కీమతీ చీజ్ పర్దే మే హోతీ హై” (“ప్రతి విలువైన వస్తువును కప్పి ఉంచుతారు”) అంటూ పోస్టర్లను అంటించారు. కర్ణాటక ఘటన తర్వాత హిజాబ్‌కు మద్దతుగా ఎంఐఎం విద్యార్థి ఫ్రంట్ నాయకుడు ఫరూక్ ఇలుక్మాన్ బ్యానర్లు కట్టారు. దివ్య మరాఠీ కథనం ప్రకారం.. ఫిబ్రవరి 8, 2022 మంగళవారం రాత్రి 7.30 గంటలకు పోలీసులు అతన్ని విచారణ కోసం పిలిచారు. అనేక ప్రశ్నలకు సమాధానమిస్తూ ఫరూక్ ఇలుక్మాన్ మాట్లాడుతూ “మేము షరియాను అనుసరిస్తాము. ముస్లిం మహిళలు వందల ఏళ్లుగా బురఖా ధరిస్తున్నారు” అని చెప్పుకొచ్చారు. “ఏ కారణం లేకుండానే ఈ సంప్రదాయానికి అడ్డుకట్ట పడుతోంది. రాజ్యాంగం కూడా మనకు ఈ హక్కును కల్పించింది. కర్ణాటకలో ఘటనలు వివక్షాపూరితమైనవి. కర్ణాటక ఘటనతో భయాందోళనకు గురైన ముస్లిం మహిళలకు భరోసా కల్పించేందుకు ఈ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు.” అని చెప్పినట్లు కథనాలు వచ్చాయి.

  పగటిపూట వెలిసిన బ్యానర్లను పోలీసుల సమక్షంలో అర్థరాత్రి తొలగించారు. 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం రాకముందు నిజాం భూభాగంలో భాగంగా ఉన్న మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతానికి మధ్యలో బీడ్ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలోని ఎనిమిది జిల్లాలు మతపరమైన కోణాల్లో చాలా సున్నితంగా ఉంటాయి. వివిధ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థల స్లీపర్ సెల్స్‌కు సురక్షిత నిలయంగా ఉంది. 26/11 దాడుల సూత్రధారి అయిన అబూ జుందాల్ అలియాస్ జబియుద్దీన్ అన్సారీ బీడ్ నగరానికి చెందినవాడు. అతను స్వయంగా కరాచీలో కూర్చుని తాజ్‌హోటల్ లోని ఉగ్రవాదులకు సూచనలిచ్చాడు.

  Trending Stories

  Related Stories