ఐటీ అధికారులపై మంత్రి మల్లారెడ్డి పెట్టిన కేసుపై హైకోర్టు స్టే విధించింది. 4వారాల పాటు దర్యాప్తు చేయరాదని ఆదేశించింది. మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ఫిర్యాదు మేరకు.. ఐటీ అధికారి రత్నాకర్‌పై బోయినపల్లి పీఎస్‌లో కేసు నమోదయింది. ఐపీసీ సెక్షన్ 384 కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు అయింది. దీంతో తనపై కేసును కొట్టివేయాలని కోరుతూ ఐటీ అధికారి రత్నాకర్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం స్టే ఇస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
మంత్రి మల్లారెడ్డి నివాసంలో 48 గంటలు సోదాలు జరిగిన తర్వాత అర్ధరాత్రి హైడ్రామా జరిగింది. ఐటీ అధికారులు సంతకాలు పెట్టించుకోవడంలో తమకు మోసం జరిగిందని చెబుతూ మంత్రి కుమారుడు భద్రారెడ్డి ఐటీ అధికారి రత్నాకర్‌పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ కేసును సవాల్ చేస్తూ అధికారి హైకోర్టులో ఫిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ వాదనలు జరిగాయి. ఇరువైపు వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.