ఈటల కాన్వాయ్ పై రాళ్ల దాడి.. మునుగోడులో ఉద్రిక్తత

0
796

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం ముగిసే రోజున తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మునుగోడు మండలం పలివెలలో మంగళవారం మధ్యాహ్నం ప్రచారంలో ఉన్న బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగాయి. ఇంకొన్ని గంటల్లో ప్రచారం ముగుస్తుందనగా మునుగోడు ఉప ఎన్నికల్లో రభస చోటుచేసుకుంది. ఈటల కాన్వాయ్ పలివెలకు రాగానే కాన్వాయ్ లోని వాహనాలపై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగాయి. అప్పటికే కాన్వాయ్ ను వెన్నంటి వస్తున్న బీజేపీ శ్రేణులు దాడిని అడ్డుకున్నాయి. జోక్యం చేసుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టాయి. టీఆర్ఎస్ శ్రేణుల దాడిలో ఈటల కాన్వాయ్ లోని పలు వాహనాల అద్దాలు ధ్వంసం కాగా ఈటల పీఆర్వో కాలికి గాయమైంది.