More

    ఓల్డ్ సిటీలో కొనసాగుతున్న ఉద్రిక్తత

    మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్తపై అనుచిత వ్యాఖ్య‌ల వ్య‌వ‌హారంలో గోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ ను అరెస్ట్‌ చేశారు. రాజా సింగ్ అనుకూల‌, వ్య‌తిరేక వ‌ర్గాల నిర‌స‌న‌ల‌తో మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని ప‌లు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటుచేసుకున్నాయి. రాజా సింగ్‌ను రిమాండ్‌కు పంపాలంటూ పోలీసులు దాఖ‌లు చేసిన అఫిడ‌విట్‌ను నాంప‌ల్లి కోర్టు తిర‌స్క‌రించింది. ఓ వ్య‌క్తిని అరెస్ట్ చేయాలంటే 41ఏ సీఆర్పీసీ సెక్ష‌న్ కింద నోటీసులు ఇవ్వాల్సి ఉంద‌ని, అయితే రాజా సింగ్‌కు అలాంటి నోటీసులు ఇవ్వ‌కుండానే అరెస్ట్ చేశారంటూ కోర్టు పోలీసుల‌ను త‌ప్పుబ‌ట్టింది. ప్ర‌భుత్వ లాయ‌ర్లు, రాజా సింగ్ లాయ‌ర్ల మ‌ధ్య దాదాపుగా 45 నిమిషాల పాటు తీవ్ర స్థాయిలో వాదోప‌వాదాలు కొన‌సాగాయి. రాజా సింగ్‌ను అరెస్ట్ చేసే స‌మ‌యంలో పోలీసులు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను పాటించ‌లేద‌ని ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాదులు కోర్టుకు తెలిపారు. ఇరు వ‌ర్గాల వాద‌న‌లు సావ‌దానంగా విన్న న్యాయ‌మూర్తి… రాజా సింగ్ రిమాండ్ రిపోర్ట్‌ను తిర‌స్క‌రిస్తున్న‌ట్లు తెలిపారు. ఆయ‌న‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.

    రాజా సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో పాత బస్తీ లో హై టెన్షన్ కొనసాగుతోంది. ఎంఐఎం కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి రాజా సింగ్ కు ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. నిరాసన కారుల ఆందోళనల కారణంగా పోలీస్ వాహనం ధ్వంసం అయింది. పాతబస్తీ కి అదనపు దళాలను పంపారు. పోలీసులు ఎంఐఎం కార్యకర్త లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీస్ వాహనంపై యువకులు రాళ్లు రువ్వారు. ఆందోళనలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు.

    spot_img

    Trending Stories

    Related Stories