Telugu States

తెలంగాణకు హై పవర్ కమిటీ

భారీ వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో జరిగిన నష్టంపై అంచనా వేయడానికి రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన హై పవర్ కమిటీ రానుంది. పంట నష్టంపై అంచనా వేసి కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమితా షా కలిశారు. ఈ సమావేశంలో భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితులను ఆయనకు వివరించారు. వరదల వల్ల సంభవించిన నష్టాన్ని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. హోంశాఖ ఆధ్వర్యంలోని ఉన్నతస్థాయి బృందాన్ని తక్షణమే తెలంగాణకు పంపాలని సంబంధిత శాఖ అధికారులను అమిత్ షా ఆదేశించారు. త్వరలో రాష్ట్రంలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయాలని సూచించారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలిపారు.

Related Articles

Back to top button