More

    నటుడు సుమన్ భారత సైన్యానికి 117 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారా.. నిజం తెలుసుకోండి..!

    ప్రముఖ సినీ నటుడు సుమన్ భారత సైన్యానికి 117 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారనే వార్త సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతోంది. ఆయన ఇలాంటి గొప్ప పని చేసినందుకు పలువురు ప్రశంసిస్తూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇండియన్ ఆర్మీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 117 ఎకరాల భూమిని సుమన్ విరాళంగా అందించినట్లు పోస్టులు పెట్టారు.

    ఆయన భూమిని విరాళంగా ఇచ్చారని.. ”దేశ సరిహద్దుల్లో జవానులు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకొంటున్నారో నేను ప్రత్యక్షంగా చూసా.. దేశ సరిహద్దుల్లో జవానులు అన్నిటికి ఓర్చుకుని మనల్ని రక్షిస్తున్నారు. వాళ్ళలా మనం ఒక్కరోజు కూడా పని చేయలేము.. ఫ్యామిలీస్ కి దూరంగా మన కోసం బోర్డర్ లో అన్ని త్యాగం చేస్తున్నారు.. వాళ్ళను చూసినప్పుడు వాళ్ళ కోసం ఏదైనా చేయాలనీ అనిపించింది. అందుకే నేను నా భార్యతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నా” అని చెప్పారని కొన్ని వెబ్సైట్స్ కథనాలను కూడా వండాయి.

    ఈ వార్తలపై తాజాగా సుమన్ స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని స్పష్టం చేశారు. ఇండియన్ ఆర్మీకి ఇచ్చినట్టుగా చెబుతున్న భూమి వివాదంలో ఉందని, ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉందని చెప్పారు. వివాదం పరిష్కారమైన వెంటనే తానే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తానని చెప్పారు. కాబట్టి సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యే ఇలాంటి వార్తలను నమ్మొద్దని సుమన్ కోరారు. ఆ భూమికి సంబంధించిన వివాదం ఇంకా కోర్టులో కొనసాగుతోంది. వివాదానికి పరిష్కారం రాగానే వ్యక్తిగతంగా నేనే వివరాలు మీడియా ద్వారా వెల్లడిస్తాను. దానికి సంబంధించి ఏ విషయమైనా నేనే చెబుతానని ఆయన అన్నారు.

    Trending Stories

    Related Stories