More

    హీరో నాగశౌర్య విల్లాలో భారీగా పేకాట.. 20కి పైగా కార్లలో వచ్చి ఆడుతున్నారంటే..!

    టాలీవుడ్ యువనటుడు నాగశౌర్య విల్లాపై దాడిచేసిన పోలీసులు పేకాట ఆడుతున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలోని మంచిరేవుల వద్దనున్న నాగశౌర్య విల్లాపై దాడి చేశారు. సుమన్ అనే వ్యక్తి బర్త్ డే ఫంక్షన్ కోసం ఈ విల్లాను అద్దెకు తీసుకుని దానిని పేకాట స్థావరంగా మార్చినట్టు తెలుస్తోంది. పేకాట రాయుళ్ల దగ్గర నుండి పెద్దమొత్తంలో నగదు, సెల్‌ఫోన్లు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 25 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ. 6.7 లక్షల నగదు, 33 సెల్‌ఫోన్లు, 24 కార్లు, 2 క్యాసినో డబ్బాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సుమన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆరు నెలల క్రితం ఈ విల్లాను నాగశౌర్య అద్దెకు తీసుకున్నారు. పోలీసుల రాకను గుర్తించిన కొందరు తప్పించుకునేందుకు మద్యం సీసాలను వారిపైకి విసిరినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    ఫామ్‌హౌస్ ను బర్త్ డే పార్టీ కోసం తీసుకొన్నారని పోలీసులు తెలిపారు. సుమన్ కుమార్ అనే వ్యక్తి బర్త్ డే పార్టీ కోసం ఈ ఫామ్ హౌస్ ను బుక్ చేశారని పోలీసులు గుర్తించారు. ఈ ఫామ్ హౌస్ లో టేబుల్స్, పేక ముక్కలు, ఖరీదైన మద్యం బాటిల్స్ ను పోలీసులు గుర్తించారు. పోలీసులు వచ్చిన విషయాన్ని గుర్తించిన కొందరు అక్కడి నుండి పారిపోయారు. పోలీసులకు 25 మంది వరకూ చిక్కారు. వారిని నార్సింగ్ పోలీసులకు అప్పగించారు. ఈ ఫామ్‌హౌస్‌లో 24 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టూ వీల్లరను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ విషయంపై పోలీసులు హీరో నాగశౌర్యను కూడా విచారించనున్నారు.

    Trending Stories

    Related Stories