ఆ దంపతులకు నోటీసులు పంపిన తమిళ హీరో ధనుష్

0
825

మధురైలో ఉండే కథిరేసన్, మీనాక్షి అనే దంపతులు.. ధనుష్ తమ కొడుకే అంటూ గతంలో చాలా సార్లు మీడియా ముందుకు వచ్చారు. చిన్నప్పటి నుండి ధనుష్‌కు సినిమాలంటే ఇష్టమని, అందుకే ఇంట్లో నుండి పారిపోయాడని వారు చెప్పారు. ఈ కేసు ఎంతోకాలంగా సాగుతూనే ఉంది. సినిమాలపై ఉన్న ఆసక్తితో చిన్నప్పుడే ధనుష్ ఇల్లు వదిలి చెన్నై వెళ్లిపోయాడని కదిరేశన్, మీనాక్షి దంపతులు తెలిపారు. సొంత తల్లిదండ్రులకు నెలవారీ రూ. 65 వేలు పరిహారం చెల్లించాలని కోరారు. అయితే ఈ ఆరోపణల్లో నిజం లేదని అంటున్నారు ధనుష్. తాను డైరెక్టర్ కస్తూరి రాజా కుమారుడినంటూ ధనుష్ గతంలో కోర్టుకు జనన ధృవీకరణ పత్రాలు సమర్పించారు. తాజాగా తమకు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం కింద చెల్లించాల్సి వుంటుందని నటుడు ధనుష్‌ దంపతులకు కోర్టు నోటీసులు పంపారు. తమ గౌరవానికి ఇబ్బంది కలిగించేలా చేస్తున్న ఆరోపణలను ఇకనైనా ఆపాలని ఆయన కోరారు. ఈ ఆరోపణలపై ధనుష్‌, ఆయన తండ్రి కసూర్తిరాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షమాపణలు చెబుతూ ఒక స్టేట్‌మెంట్‌ని విడుదల చేయాలని, లేకుంటే రూ. 10 కోట్ల పరువు నష్టం కేసును ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ధనుష్.. తన తండ్రి కస్తూరి రాజాతో కలిసి కథిరేసన్‌కు లీగల్ నోటీసులు పంపారు.