More

    కష్టం వచ్చిందా ‘హిందూ హెల్ప్ లైన్ నెంబర్’ కు ఫోన్ చేసేయండి

    బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్‌లు హిందువులకు సహాయం చేయడానికి మరో బృహత్తర అంశాన్ని తీసుకుని వచ్చాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏ హిందువుకు ఆపద వచ్చినా ఆదుకునేందుకు బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్‌లు సిద్ధంగా ఉన్నాయని వీహెచ్పీ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్ అన్నారు. ధర్మ రక్షణ కోసం నిరంతరం అన్నివేళలా హిందువులకు అండగా ఉంటామని.. గురు పౌర్ణమి సందర్భంగా కోఠిలోని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయంలో హిందూ హెల్ప్ లైన్ నెంబర్ 9110765545 ప్రారంభించారు.

    పండరీనాథ్ మాట్లాడుతూ.. ఇతర మతస్తుల దుర్మార్గాల నుంచి హిందూ సమాజాన్ని కాపాడుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. గోరక్ష , లవ్ జిహాద్, మతమార్పిడి, దేవాలయాల భూముల కబ్జా, హిందూ జీవన విధానం పై సాంస్కృతిక దాడులు ఇలా అనేక రంగాలపై ఇతర మతస్థులు చేస్తున్న హింస నుంచి హిందూ సమాజాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. హిందువుల పట్ల ఎన్నో అక్రమాలు జరుగుతూనే ఉన్నా ఎదుర్కోవడానికి ఎవరు సహాయం చేయడం లేదన్నారు. మీ పరిధిలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే వెంటనే విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయానికి హెల్ప్ లైన్‌కు ఫోన్ చేయాలని నాయకులు సూచించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని, వాటిని ఎదుర్కొనేందుకు విశ్వహిందూ పరిషత్ నిరంతరం పోరాటం సాగిస్తుందని చెప్పారు.

    హిందూ దేవతలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కించపరిచారని.. కేసీఆర్ పై వెంటనే కేసు నమోదు చేయాలని పండరీనాథ్ డిమాండ్ చేశారు. జోగులాంబ అమ్మవారిని కించపరిచే విధంగా చేసిన వాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. హిందు దేవతపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, శక్తి పీఠం జోగులాంబ అమ్మవారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే హిందువులు సహించరన్నారు. గతంలో హిందుగాళ్ళు, బొందు గాళ్ళు అంటూ.. హిందువులను కించపరిచారని, కేసీఆర్ పై అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నట్లు వెల్లడించారు.

    Trending Stories

    Related Stories