More

    కేరళలో భారీ వర్షాలు.. ఊహించని వరదలు

    కేరళలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో దక్షిణాది జిల్లాల్లో నదులు ఉప్పొంగుతున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఉత్తరాది జిల్లాల్లో వర్ష తీవ్రత మరింత పెరుగుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. ఈ మేరకు ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వరదల కారణంగా కొట్టాయం, పతనమ్‌థిట్ట జిల్లాలు బాగా దెబ్బతిన్నాయి. పతనమ్‌థిట్టలోని కక్కి డ్యామ్, త్రిసూర్‌లోని షోలాయర్, ఇడుక్కిలోని కుందాల, కల్లర‌కుట్టి డ్యామ్‌ల వద్ద రెడ్ అలెర్ట్ జారీ చేశారు.

    కూటిక్కల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడగా, 12 మంది గల్లంతయ్యారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కేరళలోని డ్యామ్ లు నిండిపోయాయి. ఇడుక్కి జిల్లాలోని మలంకర డ్యామ్ కు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తేందుకు కలెక్టర్ అనుమతి మంజూరు చేశారు. ఎర్నాకుళం జిల్లాలో మువట్టుపుళ నది ఉగ్రరూపం దాల్చింది. నదీ పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎం పినరయి విజయన్ సమీక్ష చేపట్టారు.

    భారీ వర్షాల కారణంగా పోలీసులు ఘటన స్థలానికి చేరుకోలేకపోవడంతో గాలింపు చర్యల కోసం వాయసేన సాయాన్ని కేరళ ప్రభుత్వం కోరింది. కొట్టాయం జిల్లాలోని కూటికల్‌లో సహాయ చర్యల కోసం వైమానిక సాయాన్ని కోరినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. కొట్టాయంలో జిల్లాలో కొండ చరియలు విరిగిపడడంతో మూడు ఇళ్లు ధ్వంసం కాగా, పదిమంది గల్లంతయ్యారు. జిల్లాలో నాలుగు చోట్ల కూడా కొండచరియలు విరిగిపడినట్టు అధికారులు చెబుతున్నారు.

    Trending Stories

    Related Stories