Telugu States

తెలుగు రాష్ట్రాలకు వరదల ముప్పు.. అలర్ట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రభుత్వం అప్రమత్తం అయింది. భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో విపత్తుల సంస్థలో స్టేట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. మీ ప్రాంతంలో భారీ వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉంటే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని వాతావరణ అధికారులు సూచించారు. అత్యవసర సహయం, సమాచారం కోసం 24 గంటలు స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు కంట్రోల్ రూం నంబర్ ఫోన్ నంబర్ల జాబితాను ఓప్రకటనలో విడుదల చేశారు. 1070, 18004250101, 08632377118 నంబర్లకు డయల్ చేసి అత్యవసర సహాయం లేదా సమాచారం ఇవ్వాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ఆదేశాలను జారీ చేశారు. ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించాలని చెప్పారు. తాను కూడా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటానని తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నేతలు ప్రజల రక్షణ నిమిత్తం అప్రమత్తంగా ఉండాలని, సహాయక చర్యల్లో పాల్గొనాలని కేసీఆర్ ఆదేశించారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.

Related Articles

Back to top button