More

    హైదరాబాద్ ను మరోసారి వణికిస్తున్న వరుణుడు

    బుధవారం రాత్రి హైదరాబాద్ నగరంలోని పలుప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కుండపోతగా వానపడింది. లోతట్టు ప్రాంతాలు, రోడ్లన్నీ జలమయమయ్యాయి. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, చార్మినార్, సికింద్రాబాద్, ఎల్‌బీనగర్‌ జోన్లలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కూకట్‌పల్లిలో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, కుత్బుల్లాపూర్‌లో 9.2 సెంటీమీటర్లు, తిరుమలగిరిలో 9 సెం.మీ., రామచంద్రాపురం 8.2 సెం.మీ., మూసాపేట్‌ 8 సెం.మీ., ఫతేనగర్‌లో 7.3 సెం.మీ., పటాన్‌చెరు 7.2 సెం.మీ., బాలానగర్‌ 6.8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది. ఖైరతాబాద్, అమీర్‌పేట్‌, ఎల్లారెడ్డిగూడ రోడ్డు జంక్షన్, బేగంపేట్, కుత్బుల్లాపూర్, ఆల్వాల్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, సనత్‌గర్, ఎస్ఆర్‌నగర్, వెస్ట్‌ వెంకటాపురం, రామచంద్రాపురం రోడ్లపై నీరు భారీగా ప్రవహించింది.

    హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా వాన దంచికొట్టింది. నగరంలోని జంట జలాశయాలకు వరద ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే నిండుకుండల్లా ఉన్న రెండు రిజర్వాయర్లలోని భారీగా నీరు వచ్చిచేరుతున్నది. ఎగువనుంచి ఉస్మాన్‌సాగర్‌లోకి 900 క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి 952 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. ఇక హిమాయత్‌సాగర్‌లోకి 1200 క్యూసెక్కుల వరద వస్తోంది. రెండు గేట్లు ఎత్తి 1373 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. రెండు చెరువుల్లో నీటిని వదిలేయడంతో దిగువన ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

    Trending Stories

    Related Stories