More

    తెలంగాణకు పొంచి ఉన్న వర్షం ముప్పు

    తెలంగాణలో పలు ప్రాంతాల్లో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజులపాటు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి తోడు ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో మరో ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణశాఖ తెలిపింది. వీటి ప్రభావంతో మంగళవారం నుంచి మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీ సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తమిళనాడులో నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణశాఖ పేర్కొంది.

    పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం ప్రభావంతో ఆదివారం కోస్తాలో ఎక్కువచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురిశాయి. ఉత్తరకోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని, ఈ నెల నాలుగు, ఐదు తేదీల్లో కోస్తాలో అనేకచోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

    Trending Stories

    Related Stories