More

    ఇంజమామ్ కు హార్ట్ అటాక్

    పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ కు గుండెపోటుకు గురయ్యారు. సోమవారం రాత్రి గుండెపోటు కారణంగా లాహోర్‌లో ఆసుపత్రిలో చేరారు. 51 సంవత్సరాల ఇంజమామ్ కు అత్యవసర యాంజియోప్లాస్టీ చేసినట్లు పాక్ మీడియా తెలిపింది. ఇంజమామ్ గత మూడు రోజులుగా ఛాతీ నొప్పితో బాధపడుతున్నాడని.. అదే విషయమై కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు చెప్పినట్లు తెలుస్తోంది. సోమవారం మరింత నొప్పి ఎక్కువవ్వడంతో ఆసుపత్రికి ఇంజమామ్ ను తరలించారు.

    సోమవారం గుండెపోటు వచ్చినట్లు తెలియడంతో అతడిని శస్త్రచికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇంజమామ్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని.. ఆసుపత్రి వర్గాలు పర్యవేక్షిస్తూ ఉన్నాయని అతని ఏజెంట్ మీడియాకు తెలియజేశారు. ఇంజమామ్ కు అత్యవసర యాంజియోప్లాస్టీ నిర్వహించాలని వైద్యులు సూచించారు. ప్రసిద్ధ హార్ట్ సర్జన్ ప్రొఫెసర్ అబ్బాస్ కాజిమ్ సర్జరీ నిర్వహించారు. “ఇంజమామ్ ఆరోగ్యం ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది. ఆసుపత్రి నుండి త్వరలో డిశ్చార్జ్ చేయబడతారు. ఇప్పుడు బాగానే ఉన్నాడు” అని ఒక కుటుంబ సభ్యుడు చెప్పాడు.

    1992 ప్రపంచ కప్‌లో ఇంజమామ్ అద్భుతమైన ప్రదర్శన చేసాడు. ఇక 375 మ్యాచ్‌ల్లో 11701 పరుగులతో పాక్ తరపున వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. టెస్టుల్లో 119 మ్యాచ్‌ల్లో 8829 పరుగులు చేశాడు. 2016 నుండి 2019 వరకు పాక్ క్రికెట్ బోర్డ్ (PCB) లో చీఫ్ సెలెక్టర్‌గా పనిచేశాడు. ఆఫ్ఘనిస్తాన్ కోచ్‌గా కూడా పనిచేశాడు. ఇంజమామ్ పూర్తిగా కోలుకోవాలని కోరుకోవాలని క్రికెట్ అభిమానులు, భారత మాజీ క్రికెటర్లు ట్వీట్లు చేశారు.

    Trending Stories

    Related Stories