More

  దేశద్రోహికి నో బెయిల్..! ఉమర్ ఖలీద్ పిటిషన్ తిరస్కరణ..!!

  2020 ఢిల్లీ అల్లర్ల కేసులో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసిన ఉమర్ ఖలీద్ కు ఢిల్లీ హైకోర్లు బెయిల్ ను తిరస్కరించింది. షాహీన్ బాగ్ లో పక్కా ప్లాన్ ప్రకారమే అల్లర్లు జరిగేలా ప్రజలను రెచ్చగొట్టారనే ఆరోపణలున్నాయి. దీంతో UAPA చట్టం కింద అరెస్టయ్యాడు. ఈ నేపథ్యంలో ఉమర్ ఖలీద్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగిపన జస్టిస్ సిద్దార్థ్ ముృదుల్, రజ్నీష్ భట్నాగర్ లతో కూడిన బెంచ్ బెయిల్ నిరాకరించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమర్ ఖలీద్ షాహీన్ బాగ్ నిరసనల్లో కావాలనే ముస్లింలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఈ కేసులో ప్రతివాదులైన ఢిల్లీ పోలీసులు కూడా ఈ అల్లర్లను కూడా ఒక ప్రణాళికాబద్దంగానే చేశారని కోర్టుకు తెలిపారు. ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ లతో పాటు ఎంతో మంది షాహీన్ బాగ్ నిరసనల్లో మస్లింలను రెచ్చగొట్టేవిధంగా ప్రసంగాలు చేశారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ట్రిపుల్ తలాక్, బాబ్రీ మసీద్, కశ్మీర్ అంశాలను పదే పదే ప్రస్తావిస్తూ ముస్లిం వర్గాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నించారని తెలిపారు. దీంతో పాటు సరిగ్గా నాటి అమెరికా అధ్యక్షుడు భారత్ పర్యటనకు వచ్చినప్పుడు పక్కా ప్లాన్ ప్రకారమే.. హిందూ ముస్లింల మధ్య అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించారని పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఇలా పక్కా ప్లాన్ ప్రకారమే అల్లర్లను ప్రేరేపించడానికి ఉమర్ ఖలీద్ ప్రయత్నించాడని చెప్పడంతో న్యాయమూర్తులు పోలీసులతో ఏకీభవించి ఉమర్ ఖలీద్ కు బెయిల్ ను నిరాకరించారు.

  కేంద్ర ప్రభుత్వం 2019 డిసెంబర్ లో సిటిజెన్‎షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ ను పార్లమెంట్ లో పాస్ చేయించింది. దీంతో ఢిల్లీ షాహీన్ బాగ్ లో ముస్లింలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. షాహీన్ బాగ్ ప్రాంతంలో రోడ్లను దిగ్భంధనం చేసి నెలల తరబడి నిరసనలు చేశారు. ఈ నిరసనల్లో ఉమర్ ఖలీద్ తరచూ బాబ్రీ మసీద్ ను ప్రస్తావిస్తూ ముస్లింలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడు. బీజేపీ ప్రభుత్వంలో ముస్లింలు ఏమాత్రం క్షేమంగా లేరంటూ వ్యాఖ్యలు చేశాడు. మైనార్టీలను భారత్ నుంచి తరిమివేస్తారని వ్యాఖ్యానించాడు. దీనికి ఉదాహరణగా కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు లాంటివాటిని సాకుగా చూపేవాడు. అప్పట్లో తీసుకొచ్చిన సీఏఏ బిల్లుతో కూడా ముస్లింలను భయాందోలనలకు గురిచేసేలా ప్రయత్నించాడు. దీంతో పాటు నాటి అమెరికా అధ్యక్షుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా అల్లర్లు సృష్టించడానికి కూడా కుట్రలు పన్నాడు ఉమర్ ఖలీద్.

  ఈ ముందస్తు ప్రణాళికలో ఉమర్ ఖలీద్ తో పాటు పలువురు వ్యక్తులు కూడా పాలుపంచుకున్నారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది షర్జీల్ ఇమామ్. జేఎన్‎యూ విద్యార్థి, స్కాలర్ అయిన షర్జీల్ ఇమామ్ కూడా షాహీన్ బాగ్ నిరసనల్లో ప్రసంగించాడు. ఇందులో ఏకంగా భారత్ ను విడదీయాలనే ప్రసంగాలు చేశాడు. భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలనుంచి ఇతర రాష్ట్రాలను కలిపి ఉంచే చికెన్ నెక్ భాగాన్ని విడదీయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. చికెన్ నెక్ కొన్ని చోట్ల కేవలం పది కిలోమీటర్ల వెడల్పులో మాత్రమే ఉంది. భారత్ కు వ్యూహాత్మకంగా, రక్షణ పరంగా ఇది ఎంతో కీలకమైన ప్రాంతం. దీన్ని దిగ్భందిస్తే భారత్ నుంచి ఈశాన్య ప్రాంతాలను పూర్తిగా వేరుచేయవచ్చని షర్జీల్ ఇమామ్ కుట్రపూరిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో అప్పట్లో ఇతడిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. షాహీన్ బాగ్ నిరసనల పేరుతో దేశాన్ని విడదీసే కుట్ర జరుగుతోందని పలువురు వ్యాఖ్యానించారు. దీంతో ఢిల్లీ పోలీసులు షర్జీల్ ఇమామ్ ను యుఏపీఏ చట్టం కింద అరెస్టు చేశారు. ఇతడితో పాటు ఢిల్లీ అల్లర్లలో ఉమర్ ఖలీద్ కూడా కీలక పాత్ర పోషించాడు. ఢిల్లీలో నివసించే ప్రజల రోజువారీ జీవన విధానానికి ఆటంకం కల్గించే విధంగా రోడ్ల దిగ్భందనం చేశాడు. దీంతో పాటు అల్లర్లలో ఆయుధాలు సమకూర్చడం నుంచి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వంటివి చేశాడు ఉమర్ ఖలీద్. దీంతో ఢిల్లీ పోలీసులు 2020 దేశద్రోహ చట్టం కింద అరెస్టు చేశారు. అప్పటి నుంచి జైల్లో నే ఉన్న ఉమర్ ఖలీద్ తాజాగా వేసిన బెయిల్ పిటిషన్ ను కూడా ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.

  ఇక ఉమర్ ఖలీద్ ఇప్పుడే కాదు. 2016లోనూ దేశద్రోహ చట్టం క్రింద అరెస్టు అయ్యాడు. ఉమర్ ఖలీద్ తండ్రి గతంలో నిషేధిత సిమి ఉగ్రవాద సంస్థలో క్రియాశీలకంగా పనిచేశాడు. దీంతో కొడుకు ఉమర్ ఖలీద్ కు కూడా అదే భావజాలం అలవడింది. ఢిల్లీ జేఎన్‎యూ లో చదువుకునే సమయంలో కూడా దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. 2016 లో జేఎన్ యూ లో భారత్ ను ముక్కలు చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో దేశ ద్రోహం క్రింద అరెస్టు చేశారు.

  Trending Stories

  Related Stories