అరే… ఈ ప్రపంచానికి ఏమైంది? ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన.., ఓ ప్రభుత్వాన్ని కూల్చేసి… మొత్తం దేశాన్ని టెర్రరిస్టు మూకలు ఆక్రమించుకున్నా..కళ్లు అప్పగించి వినోదం చూస్తున్నట్లు చూస్తున్నాయి ప్రపంచ దేశాలు..ప్రజాస్వామ్య విలువలు., నైతిక నియమాలు…, కనీస మానవీయ విలువలులేని.., మానవ హక్కులను హరించే రాక్షస మూకలు దర్జాగా అప్గానిస్తాన్ ను పాలిస్తున్నామని ప్రకటిస్తుంటే.. ఇది దారుణమని.., తప్పు జరుగుతోందని ఏ ఒక్క దేశం కూడా బహిరంగగా చెప్పే సాహసం చేయడం లేదేందుకు?
ఇక ఈ మాత్రం దానికి ఐక్యరాజ్యసమితి ఎందుకు? ఇంకా ఏమన్నా అంటే యూఎన్ భద్రతామండలి అంటారు. మళ్లీ అందులో వీటో పవర్ కలిగిన సభ్యదేశాలంటారు.? ఆంక్షలు విధిస్తామంటారు.., పీస్ కీపింగ్ ఫోర్సులు పంపిస్తామంటారు.?
ఈ ప్రపంచం పూర్తిగా మారిపోయింది. మళ్లీ మధ్యయుగాలని నరమేధం జరిపిన రాజ్యాల దిశగా పయనిస్తుందా? కమ్యూనిస్టు ఐడియాలజీ పోయింది? క్యాప్టలిస్టు ఐడియాలజీ పోయింది..? కోల్డ్ వార్ పోయింది? ఏక ధృవ ప్రపంచమన కాన్సెఫ్టు పోయింది.? ఇప్పుడు ఈ ప్రపచంలో బలవంతులదే రాజ్యయితే..! ఆ బలవంతులు ధర్మ విరోధులు… ప్రపంచ నాశసకులు అయితే ఎలా? కళ్ళ ముందు అన్యాయాలు…అక్రమాలు… నరమేధం జరుగుతున్న … మాకేంటి? ఆ పాముల పుట్టలో మేము వేలు పెట్టం అంటూ ప్రపంచ దేశాలు చూస్తు ఉండిపోవాల్సిందేనా? ప్రపంచ దేశాల కలెక్టివ్ రెస్పాన్స్ బులిటీవ్ ఏమైంది?
చూడండి.. ఇప్పుడు వరల్డ్ మోస్టు టెర్రరిస్టులు అఫ్గానిస్తాన్ పాలకులు అయ్యారు. నరహంతకులు రాజ్యపాలకులు అయ్యారు. నైతిక విలువలు…మానవీయ కట్టుబాట్లు కలిగిన ఏ ప్రజాస్వామ్యయుత ప్రభుత్వమైనా వీరిని ఎలా గుర్తిస్తుంది చెప్పండి? అఫ్గానిస్తాన్ ప్రభుత్వాన్ని ఏ దేశాలు అయితే గుర్తిస్తాయో…ఆ దేశాలు ఇక టెర్రరిజాన్ని సైతం జస్టిఫై చేస్తున్నాట్లేనని మనం అర్థం చేసుకోవాలి. ఆయా దేశాలు టెర్రరిజానికి తమ ఆమోద ముద్రవేస్తున్నాయని గుర్తించాలి.
ఈ ప్రపంచానికి ఏం పరిస్థితి దాపురించిందిరాబాబో..! లేకపోతేంటి… మీరే చూడండి. అఫ్గాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు రెండు రోజుల క్రితం తమ కొత్త ప్రభుత్వాన్ని.. ప్రకటించారు. అందులో అందరూ నర హంతకులే..! తాలిబన్లు ప్రకటించిన మంత్రివర్గం అంతా కూడా వరల్డ్ మోస్టు వాటెండ్ టెర్రిస్టులే. వీరిలో 14 మంది వరకు అయితే ఐక్యరాజ్యసమితి ప్రకటించిన టెర్రరిస్టు జాబితాలో ఉన్నావారే. ప్రపంచమే టెర్రిస్టులు అని గుర్తించిన వారే ఇప్పుడు అఫ్గానిస్తాన్ లో పాలకులు అయ్యారు. వీరందరూ కూడా హత్యలు, టెర్రరిస్టు కార్యకలాపాలు, అలాగే డ్రగ్స్ మాఫియాలో అరితేరినవారే.హీనమైన హేయమైన కార్యకలాపాలకు పాల్పడినవారే. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విడుదల చేసిన జాబితాలో ఉన్న ఈ టెర్రరిస్టులును పట్టుకునేందుకు అమెరికాతోపాటు అనేక దేశాలు నిన్నమొన్నటి వరకు ముమ్మర వేటను కొనసాగించాయి. వారిపై మూవ్ మెంట్ పై అనేక ఆంక్షలు విధించాయి. రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నాయి. అఫ్గాన్ నూతన ప్రధాని ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ నుంచి మొదలు పెడితే ప్రావిన్స్ గవర్నర్ల వరకు చాలా మంది తలలపై లక్షల డాలర్ల రివార్డులు ఉన్నాయి.
ప్రస్తుతం తాలిబన్ ప్రభుత్వంలో ప్రధాని పీఠాన్ని అధిరోహించిన ముల్లా మహ్మద్ హసన్ అఖుంద్ కరడుగట్టిన టెర్రరిస్టు తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కు సన్నిహితుడు. యూఎన్ విధించిన టెర్రరిస్టు ఆంక్షల జాబితాలో హసన్ అఖుంద్ పేరు కూడా ఉంది.
అలాగే అఫ్గాన్ ఉప ప్రధానిగా ఎంపికైన ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ కు అమెరికా మోస్టు వాటెండ్ టెర్రరిస్టే. అనేక కష్టాలు పడి అరెస్టు చేసి బరాదర్ ను పాకిస్తాన్ జైల్లో ఉంచింది. 8 ఏళ్ళ పాటు పాకిస్తాన్ జైల్లోనే గడిపాడు బరాదర్. బరాదర్ లాగే మరోక ఉప ప్రధాని అబ్దుల్ సలాం హనాఫీదీకి కూడా హేయమైన చరిత్రే ఉంది.
ఇక మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరోక పేరు సిరాజుద్దీన్ హక్కానీ. హక్కానీ నెట్ వర్క్ నడిపే వరల్డ్ మోస్టు డెంజరేస్ టెర్రరిస్టు. అల్ ఖైదా, ఐసిస్ తోపాటు ప్రపంచంలోని అన్ని టెర్రర్ గ్రూపులో హక్కానీకి మంచి సంబంధాలున్నాయనే ప్రచారం ఉంది. అఫ్గానిస్తాన్ అమెరికాతోపాటు నాటో దళాలపై జరిగిన అనేక ఆత్మహుతి దాడుల్లో సిరాజుద్దీన్ హక్కానీ ప్రమేయం ఉంది. అంతేకాదు అప్గాన్ మాజీ అధ్యక్షుడు హామీద్ కర్జాయ్ మీద హత్యాయత్నం చేయించిన నిందితుల జాబితాలో హక్కానీ నంబర్ వన్. ఇప్పుడు అప్గానిస్తాన్ దేశానికి హోం మినిస్టర్. అమెరికా..సీఐఏ ఈ హక్కానీని పట్టుకునేంఉదకు ఎన్నో స్కేచ్ లు వేసింది. సీఐఏ వద్ద హక్కానీకి సంబంధించిన ఒక్క క్లియర్ కట్ ఫోటో లేదు. స్కేచ్ లు మాత్రమే ఉన్నాయంటే సిరాజుద్దీన్ హక్కానీ ఎంత డేంజరస్ టెర్రరిస్టు అర్థం అవుతుంది. పాకిస్తాన్…ఐఎస్ఐ పట్టుబట్టి సిరాజుద్దీన్ కు అఫ్గానిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖను ఇప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. సిరాజుద్దీన్ హక్కానీ తలపై అమెరికా ప్రకటించిన 50 లక్షల డాలర్ల రివార్డు ఇప్పటికే అలాగే ఉంది.
అటు తాలిబన్ మంత్రివర్గంలో చోటు సంపాదించిన మహ్మద్ ఫాజిల్, ఖైరుల్లా, ముల్లా నూరుల్లా నూరీలు కూడా వరల్డ్ మోస్టు వాటెంట్ టెర్రిస్టుల జాబితాలో ఉన్నారు. అఫ్గాన్ రక్షణ మంత్రిగా నియమితులైన ముల్లా యాకూబ్ , ఆ దేశ విదేశాంగ మంత్రి ముల్లా అమీర్ ఖాన్ , ఆయన సహాయకుడు మహ్మద్ అబ్బాస్ లు 1988 నుంచి యూఎన్ టెర్రరిస్టు జాబితాలో ఉన్నవారే.
ఆధునిక కాలంలో ఏ దేశానికి అయిన సరే ఇంటర్నేషనల్ గా రికగానైజేషన్ అవసరం. మళ్లీ ప్రపంచ వ్యాప్తంగా ఖలీపా రాజ్యాన్ని స్థాపించాలని కలలు గంటున్న టర్కీ, భారత్ లో మతం పేరుతో మారణహోమం సృష్టించాలని చూస్తున్న పాకిస్తాన్, అటు ఉత్తరాన.. తూర్పు ఈశాన్యంలో భారత సరిహద్దులను కబళించాలని చూస్తున్న కమ్యూనిస్టు గుంటనక్క చైనాలు ప్రస్తుతానికి తాలిబన్ల సర్కార్ ను అధికారికంగా గుర్తించేందుకు రెడీ అయ్యాయి. రెడీ అవ్వడమేంటీ…ఈ దేశాల అధినేతలు చేసేప్రకటనలు చూస్తుంటే..ఇప్పటికే అప్గాన్ ప్రభుత్వాన్ని గుర్తించేశాయని తెలుస్తోంది. ఈ పరిణమాలపై భారత్ కూడా ఆందోళనగానే ఉందనేది నిప్పులాంటి నిజం. అఫ్గాన్ తాలిబన్ల మూలంగా మారిన ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో… భారత్ కూడా అచితూచి వ్యవహారిస్తోంది. అఫ్గానిస్తాన్ పరిణామాలపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేందుకు ప్రధాని మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో కూడిన ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారని తెలుస్తోంది. అమెరికా, రష్యా, బ్రిటన్ లకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థల అధినేతలతో కూడా అజిత్ దోవల్ నిరంతరం టచ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ ఏడో తేదీ రాత్రి ఢిల్లీలో అమెరికా, రష్యా, భారత ఎన్ఎస్ఏల సిక్రెట్ సమావేశం ఒకటి జరిగిందని చెబుతున్నారు.
మొత్తంగా అఫ్గానిస్తాన్ పరిణమాలు చూస్తుంటే… ఒక్కటి మాత్రం నిజం. అఫ్గానిస్తాన్ మంత్రివర్గంలో చోటు కావాలంటే క్వాలిఫికేషన్స్ చాలా సింపుల్. వరల్డ్ మోస్టు డేంజరస్ టెర్రిస్టు అయి ఉండాలి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి టెర్రర్ జాబితాలో చోటు ఉండాలి. వారి తలపై ఎంత ఎక్కువ రివార్డు ఉంటే..అంత మంచి పోర్టుపోలియో దక్కుతుంది. నరమేధం చేసి… ప్రజల తలలు నరికి.. ఆ తలలతో పుట్ బాల్ ఆడుకునే టెర్రర్ మూకలైతే వారి అప్గాన్ ప్రావీన్స్ లకు గవర్నర్ గా ప్రకటిస్తారు. తమ ఈ కొత్త ప్రభుత్వం ద్వారా తాలిబన్లు ప్రపంచానికి ఇదే సందేశం ఇచ్చారు. దీనికి మేరేమంటారు. మీ అభిప్రాయాలను తప్పక తెలియజేయండి.