ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన విశాఖ పర్యటనలో భాగంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యారు. ఖట్టర్‌తో భేటీ కోసమే జగన్ మంగళవారం ఉదయం విశాఖ పర్యటనకు వచ్చారు. విశాఖలో జరిగిన ఇద్దరు సీఎంల భేటీ కాసేపటి క్రితం ముగిసింది. ఖట్టర్‌తో భేటీ ముగించుకున్న జగన్ విజయవాడకు తిరుగు ప్రయాణం అయ్యారు. ప్రకృతి వైద్యం చేయించుకునేందుకు విశాఖ వచ్చిన ఖట్టర్.. ప్రస్తుతం విశాఖ పరిధిలోని ఓ ప్రకృతి వైద్య కేంద్రంలో చికిత్స తీసుకుంటున్నారు.
రుషికొండ పెమ వెల్‌నెస్ రిసార్ట్‌లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సీఎం జగన్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. అంతకు ముందు విశాఖకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ కు ఎయిర్‌పోర్ట్‌లో డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖ నగర మేయర్ గొలగానీ హరి వెంకట కుమారి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు చెట్టి ఫల్గుణ, అదీప్ రాజ్, వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి, కలెక‍్టర్ స్వాగతం పలికారు.