More

    మరోసారి బయటకు డేరా బాబా.. జైలు నుంచి రాగానే ఏం చేశాడంటే..?

    రేప్, మర్డర్ కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం బాబా ఒక భారీ కేకును ఆయన పెద్ద కత్తితో కట్ చేయడం వివాదాస్పదం అయింది. హర్యానాలోని రోహ్తక్ జిల్లాలో ఉన్న సునారియా జైల్లో ఆయన శిక్షను అనుభవిస్తున్న ఆయన.. ఒక కార్యక్రమం కోసం 40 రోజుల పెరోల్ పై జైలు నుంచి గత శనివారం బయటకు వచ్చారు.

    జైలు నుంచి ఆయన నేరుగా ఉత్తరప్రదేశ్ లోని భాగ్ పట్ లో ఉన్న బర్నవా ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ నిర్వహించిన వేడుకలో ఒక భారీ కేకును ఆయన పెద్ద కత్తితో కట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేక్ కట్ చేస్తున్న సందర్భంగా ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు కూడా వీడియోలో వినిపిస్తున్నాయి. ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఐదేళ్ల తర్వాత అవకాశం వచ్చిందని.. తను కనీసం ఐదు కేకులను కట్ చేయాలని.. ఇది తొలి కేకని డేరా బాబా అన్నారు. గత 14 నెలల సమయంలో డేరా బాబా జైలు నుంచి పెరోల్ పై బయటకు రావడం ఇది నాలుగోసారి. గత మూడు నెలల్లో బయటకు రావడం ఇది రెండోసారి. ఒక భారీ పారిశుద్ధ్య క్యాంపెయిన్ ను డేరాబాబా వర్చువల్ గా ప్రారంభించారు.

    శుక్రవారం నాడు డేరా బాబాకు హర్యానా కోర్టు పెరోల్ మంజూరు చేయగా, జైలు నిబంధనలు పూర్తి చేసుకుని శనివారం నాడు రోహ్‌తక్‌ జిల్లా సునరియా జైలు నుంచి ఆయన బయటకు వచ్చారు. ఇద్దరు మహిళా భక్తులపై అత్యాచారం కేసులో ఆయనకు 20 ఏళ్ల జైలు జైలు శిక్ష పడింది. ఇక డేరా బాబా ఈ నెల 25న జరిగే సచ్చా సౌదా మాజీ చీఫ్ షా సత్నం సింగ్ జయంతికి హాజరయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనికి ముందు మూడు నెలల క్రితం కూడా ఇదే తరహా పెరోల్‌పై డేరా బాబా విడుదలయ్యారు. ఆ వెంటనే ఆయన ఉత్తరప్రదేశ్‌లోని బర్నావా ఆశ్రమానికి వెళ్లారు.

    Trending Stories

    Related Stories