More

  మిస్ యూనివర్స్ గా భారత యువతి.. ఆ ప్రశ్నకు అద్భుతమైన సమాధానం

  డిసెంబర్ 13న మిస్ ఇండియా అయిన 21 ఏళ్ల ‘హర్నాజ్ సంధు’ మిస్ యూనివర్స్ కిరీటాన్ని కైవసం చేసుకుంది. మిస్ యూనివర్స్ ఫైనల్స్ లో పరాగ్వేకు చెందిన నాడియా ఫెర్రీరా, దక్షిణాఫ్రికాకు చెందిన లాలేలా ఎంస్వానేలతో హర్నాజ్ పోటీ పడి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. 70వ మిస్ యూనివర్స్- 2021 పోటీలు ఇజ్రాయెల్‌లోని ఎలియట్‌లో నిర్వహించారు. 2000లో లారా దత్తా టైటిల్ గెలుచుకుని 21 సంవత్సరాలు. ఆ తర్వాత మిస్ యూనివర్స్ కిరీటం భారత్ కు రావడం ఇప్పుడే.. మాజీ మిస్ యూనివర్స్ 2020, మెక్సికోకు చెందిన ఆండ్రియా మెజా హర్నాజ్ సంధుకు కిరీటాన్ని అందించారు. 1994లో సుస్మితా సేన్ ఈ అందాల పోటీలో విజేతగా నిలిచిన తొలి భారతీయురాలుగా చరిత్ర లిఖించింది.

  చండీగఢ్ కు చెందిన హార్నియా మోడలింగ్ వృత్తిలో ఉంది. ప్రస్తుతం ఆమె మాస్టర్స్ డిగ్రీ చేస్తూ.. అందాల పోటీల్లో పాల్గొంటోంది. 2021లో హార్నియా మిస్ దివాగా ఎంపికైంది 2019లో ఫెమీనా మిస్ ఇండియా పంజాబ్ టైటిల్ ను గెలుచుకుంది. 2019 ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో టాప్ 12 స్థానాల్లో నిలిచింది.

  మొదటి మూడు రౌండ్లలో భాగంగా పోటీలో ఉన్న అందగత్తెలను ప్రశ్నలు అడిగారు. “ఈరోజు యువత ఎదుర్కొంటున్న ఒత్తిళ్లవిషయమై మీరు ఏ సలహా ఇస్తారు?” అనే ప్రశ్నకు.. సంధు మాట్లాడుతూ, “నేటి యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద ఒత్తిడి, తమను తాము నమ్ముకోకపోవడమే. మీరు ప్రత్యేకమైనవారని తెలుసుకోవడం మిమ్మల్ని అందంగా చేస్తుంది. ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం మానేయండి. బయట ప్రపంచంలో జరుగుతున్న మరింత ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. బయటకు రండి, మీ కోసం మాట్లాడండి, ఎందుకంటే మీరు మీ జీవితానికి నాయకులు. మీరు మీ స్వంత వాయిస్. నేను నన్ను నమ్ముకున్నాను, అందుకే ఈ రోజు ఇక్కడ నిలబడి ఉన్నాను” అని చెప్పడంతో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది.

  అక్టోబర్‌లో మిస్ ఇండియా యూనివర్స్ 2021 కిరీటాన్ని సంధు గెలుచుకుంది. 2017లో ఆమె టైమ్స్ ఫ్రెష్ ఫేస్‌లో పాల్గొంది. ఇది ఆమె మొదటి పోటీ. ఆమె ఫెమినా మిస్ ఇండియా పంజాబ్, 2019తో సహా పలు టైటిల్‌లను సొంతం చేసుకుంది. ప్రస్తుతం, సంధు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చదువుతోంది. ఆమె పంజాబీ చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంది. త్వరలో ఆమెకు బాలీవుడ్ ఆఫర్స్ కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు.

  Trending Stories

  Related Stories