More

    హుజూరాబాద్ ఫలితంపై హరీష్ రావు వ్యాఖ్యలు విన్నారా..?

    హుజురాబాద్ లో బైపోల్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై 24,068 వేల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 22 రౌండ్లలో 8,11 రౌండ్లలో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని కొనసాగించగా.. మిగతా అన్ని రౌండ్లలో ఆధిక్యాన్ని కొనసాగించారు ఈటల. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మండలం వీణవంక మండలంలోనూ ఈటలనే ఆధిక్యం సాధించారు. సర్వేలు కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పాయి. ఈ విజయంతో వరుసగా ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఈటల. మూడు ఉప ఎన్నికలు, నాలుగు సాధారణ ఎన్నికల్లో విజయం సాధించారు.

    టీఆర్ఎస్ మంత్రి హరీశ్ రావు స్పందించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని.. దేశంలో ఇలా కలవడం ఎక్కడా లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా వెల్లడించారని హరీశ్ రావు పేర్కొన్నారు. జాతీయస్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఎలాంటి వాతావరణం ఉంటుందో అందరికీ తెలుసని, ఆ రెండు పార్టీలు నిత్యం కొట్లాడుతుంటాయని, కానీ హుజూరాబాద్ లో ఆ రెండు పార్టీలు ఎలా కలిసిపోయాయో ప్రజలు చూస్తున్నారని తెలిపారు. ఈ ఓటమితో తాము కుంగిపోవడంలేదని స్పష్టం చేశారు.

    టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్పందిస్తూ నైతిక విజయం మాత్రం తనదేనని అన్నారు. టీఆర్ఎస్ కు ఓటేసిన ప్రజలకు పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. భవిష్యత్తులోనూ హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ఉండి ప్రజాసేవ చేస్తానని అన్నారు. టీఆర్ఎస్ ఓటమి కోసం రెండు జాతీయపార్టీలు ఏకం అయ్యాయని ఆరోపించారు. విజేతగా నిలిచిన ఈటల రాజేందర్ కు శుభాకాంక్షలు చెబుతున్నానని అన్నారు.

    Trending Stories

    Related Stories