గుజరాత్‎లో కాంగ్రెస్ ఖాళీ..!

0
917

ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌లు తగులుతున్నాయి. పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు ​కాంగ్రెస్‌ను వీడుతున్నారు.

పాటిదార్ ఉద్యమ నేతగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన హార్దిక్ పటేల్ ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు ఆయన చుట్టే ఆ రాష్ట్ర పాలిటిక్స్ చక్కర్లు కొడుతోంది. గత కొంత కాలంగా కాంగ్రెస్ పై గుర్రుగా ఉన్న ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన తన ట్విట్టర్ లో కాంగ్రెస్ పేరును తొలగించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. పార్టీలో తనకు గుర్తింపు రావడం లేదని అసంతృప్తితో రగిలిపోతున్న హార్దిక్ పటేల్ పార్టీ తీరుపై బహిరంగంగానే కామెంట్లు చేశారు. అలాగే ఇటీవల బీజేపీ తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయని ఆయన చేసిన కామెంట్లు కలకలం రేపాయి. త్వరలో బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జరిగింది. కానీ అవన్ని పుకార్లే అని ఆయన కొట్టి పారేశారు. తాను బీజేపీలో చేరబోవడం లేదని స్పష్టం చేశారు. కానీ తాజాగా సోమవారం తన ట్విట్టర్ ఖాతా నుండి కాంగ్రెస్ పార్టీ పేరును తొలగించడంతో హాట్ టాపిక్ అయింది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరబోతున్నారనే ఊహగానాలు మరోసారి జోరందుకున్నాయి.

తాజాగా తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్‌ పార్టీకి ఎమ్మెల్యే అశ్విన్‌ కోత్వాల్‌ రాజీనామా చేశారు. కాగా, ఖేద్‌బ్ర‌హ్మ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే అశ్విన్ కొత్వాల్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేర‌కు త‌న రాజీనామా లేఖ‌ను గుజ‌రాత్ అసెంబ్లీ స్పీక‌ర్ నీమాబేన్ ఆచార్య‌కు స‌మ‌ర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న గిరిజ‌నులు అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతున్నట్టు తెలిపారు. బీజేపీ వ‌ల్లే గిరిజ‌నుల అభివృద్ధి సాధ్య‌మ‌ని తాను న‌మ్ముతున్నాన‌ని కొత్వాల్ కామెంట్స్‌ చేశారు. అయితే, అశ్విన్ కొత్వాల్ 2007 నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారు. ఇప్ప‌టికీ ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ నేత పార్టీని వీడటంతో కాంగ్రెస్‌కు షాక్‌ తగిలింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

3 × 5 =