‘హర హర మహాదేవ్’ పోస్టర్‌ను విడుదల చేసిన అక్కినేని నాగార్జున

0
746
hara hara mahadev poster relesed by akkineni nagarjuna
hara hara mahadev poster relesed by akkineni nagarjuna

పాన్ ఇండియన్ సినిమాగా హర హర మహాదేవ్ అన్ని భాషల్లో విడుదల కానుంది. ఈక్రమంలో ఈ మూవీ తెలుగు పోస్టర్‌ను హైద్రాబాద్‌లో కింగ్ అక్కినేని నాగార్జున విడుదల చేశారు.
జీ స్టూడియోస్ తెరకెక్కిస్తోన్న హర హర మహాదేవ్ ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో నేషనల్ వైడ్‌గా హాట్ టాపిక్ అయింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో సుబోధ్ భావే, బాజీ ప్రభు దేశ్‌పాండే పాత్రలో శరద్ కేల్కర్ నటించిన ఈ హర హర మహాదేవ్ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరాఠిలో తెరకెక్కించిన ఈ చిత్రం మొదటిసారిగా వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ తెలుగు పోస్టర్‌ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు.
‘జీ స్టూడియోస్, శ్రీ గణేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీ పోస్టర్‌ను విడుదల చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది’ అంటూ నాగార్జున అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ‘నా చిన్నతనం నుంచీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఎన్నెన్నో వింటూనే ఉన్నాను. ఆయన ఎంత గొప్ప రాజు.. ఎలా పరిపాలించాడు.. అనేవి వింటూనే పెరిగాను. ఈ కథను ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఆయన కథనే కాకుండా.. శివాజీ మహారాజ్ స్నేహితుడైన బాజీ ప్రభు దేశ్‌పాండే కథను కూడా చూపించబోతోన్నారు. లక్షాయాభై వేల సైన్యాన్ని కేవలం 300 యోధులతో ఎలా ఎదుర్కొన్నారో ఇందులో చూపించబోతోన్నారు. నేను ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. ఐదు భాషల్లో విడుదల అవుతుండటం ఆనందంగా ఉంది. ఇప్పుడు సినిమాల పరంగా భారతదేశం అంతా ఒక్కటే అయింది. చాలా చిన్నగా అనిపిస్తోంది. భాషాబేధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులు అన్ని భాషల చిత్రాలను ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే.. అన్ని భాషల ప్రేక్షకులు సినిమాలను విజయవంతం చేస్తున్నారు’ అని అన్నారు.
జీ స్టూడియోస్, శ్రీ గణేష్ మార్కెటింగ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అభిజిత్ దేశ్‌పాండే దర్శకత్వం వహించారు. సుబోధ్ భావే, శరద్ కేల్కర్, అమృతా కాన్విల్కర్, సయాలీ సంజీవ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 25న విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సిద్దమైంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

four × three =