More

    హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ మద్దతు

    ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి దేశ ప్రజల నుంచి భారీ మద్దతు వస్తోంది. భారతీయ పోస్టల్ డిపార్ట్ మెంట్ జెండాలను పోస్టాఫీసుల ద్వారా విక్రయిస్తున్న సంగతి తెలిసిందే..! అతి తక్కువ ధరలో రూ. 25కి ఒక్కో జెండాను అమ్ముతున్నారు. గత 10 రోజుల్లో ఏకంగా ఒక కోటికి పైగా జెండాలు అమ్ముడుపోయాయని కేంద్ర ప్రసారశాఖ తెలిపింది. దేశంలోని 1.5 లక్షల పోస్టాఫీసుల ద్వారా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రతి గడపకు చేరిందని.. పోస్టాఫీసుల్లో, ఆన్ లైన్ ద్వారా జెండాల అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పింది. దేశంలోని ఏ అడ్రస్ కైనా పోస్టల్ డిపార్ట్ మెంట్ ఉచితంగానే జెండాలను డోర్ డెలివరీ చేస్తోందని తెలిపింది. ఈపోస్ట్ ఆఫీస్ పోర్టల్ ద్వారా 1.75 లక్షల జెండాలు ఆన్ లైన్ లో అమ్ముడుపోయాయని చెప్పింది. రాబోయే రోజుల్లో మరింత పెద్ద సంఖ్యలో జెండాలు అమ్ముడుపోయే అవకాశం ఉంది.

    spot_img

    Trending Stories

    Related Stories