హ్యాపీ బర్త్ డే పృథ్వీరాజ్ సుకుమారన్‌!

0
772
Happy Birthday Superstar Prithviraj Sukumaran: The makers of Salaar drop the look of his character Vardharaja Mannaar from the film
Happy Birthday Superstar Prithviraj Sukumaran: The makers of Salaar drop the look of his character Vardharaja Mannaar from the film

‘సలార్’లో వరదరాజ్ మన్నార్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్… క్యారెక్టర్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘సలార్’. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిలింస్ నుంచి నిర్మాత విజ‌య్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో ప్ర‌తి నాయ‌కుడిగా న‌టిస్తున్నారు. ఆదివారం ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘సలార్’ సినిమాలో ఆయ‌న చేస్తున్న వ‌ర‌ద‌రాజ్ మ‌న్నార్ పాత్ర‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. మ‌ల‌యాళంలో పృథ్వీరాజ్ సుకుమార్‌కి ఉన్న క్రేజ్‌, ఓరా అంద‌రికీ తెలిసిందే. అలాంటి ఓ స్టార్ యాక్ట‌ర్‌ ‘సలార్’ సినిమాలో న‌టిస్తుండ‌టం అనేది సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తుంద‌న‌టంలో సందేహ‌మే లేదు.
‘సలార్’ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమార్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ చూసిన వారంద‌రూ స్ట‌న్ అవుతున్నారు. వ‌ర‌ద‌రాజ్ మ‌న్నార్ పాత్ర .. ప్ర‌భాస్ పాత్ర‌కు ధీటుగా ఉంటుంది. ఈ ఇద్ద‌రు స్టార్ హీరోల మ‌ధ్య గొప్ప డ్రామాను మ‌నం ‘సలార్’ సినిమాలో చూడ‌బోతున్నాం. అదే ఈ సినిమాలో మెయిన్ హైలైట్‌గా ఉండ‌నుంది.
పృథ్వీరాజ్ సుకుమార్ చేస్తున్న పాత్ర గురించి ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ మాట్లాడుతూ ‘‘మలయాళంలో సూపర్‌స్టార్ అయిన పృథ్వీరాజ్‌గారు మా ‘సలార్’ సినిమాలో చేయ‌టం ఎంతో ఆనందంగా ఉంది. వ‌ర‌ద‌రాజ మ‌న్నార్ పాత్ర‌లో ఆయ‌న కంటే గొప్ప‌గా మ‌రెవ‌రూ సూట్ కారు. ఆయ‌న ఆ పాత్ర‌ను పోషించిన తీరు అద్భుతం. త‌న గొప్ప న‌ట‌న‌తో పాత్ర‌కు న్యాయం చేశారు. ఆయ‌న ఈ సినిమాలో నటించడం వల్ల డ్రామా నెక్ట్స్ రేంజ్‌లో ఆడియెన్స్‌కి కిక్కేంచేలా ఉంటుంది. మలయాళ పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా ఉన్న ఆయనకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. పృథ్వీరాజ్, ప్రభాస్ లాంటి ఇద్దరు గొప్ప నటులను డైరెక్ట్ చేయ‌టం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్‌” అన్నారు.
ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కె.జి.య‌ఫ్ త‌ర్వాత బాహుబ‌లి స్టార్ ప్ర‌భాస్‌తో ప్ర‌శాంత్ నీల్‌, హోంబ‌లే ఫిలింస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న స‌లార్ చిత్రం హై ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ప్ర‌భాస్‌, పృథ్వీరాజ్ సుకుమారన్ ..ఇద‌ద‌రు ప‌వ‌ర్ హౌసెస్ లాంటి యాక్ట‌ర్స్‌వారిద్ద‌రూ క‌లిసి సినిమా చేస్తుండ‌టంతో సినిమాపై అంచనాలు మ‌రింత‌గా పెరిగాయి. వారిద్ద‌రినీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.
అలాగే కె.జి.య‌ఫ్ ఫ్రాంచైజీ సెన్సేష‌న‌ల్ స‌క్సెస్ త‌ర్వాత పాన్ ఇండియాలోనే ప్ర‌శాంత్ నీల్ మోస్ట్ వాంటెడ్ డౌరెక్ట‌ర్ అయ్యారు. ఇన్ని క్రేజీ కాంబినేష‌న్స్‌తో రూపొందుతోన్న స‌లార్ అంద‌రిలో ఎగ్జయిట్‌మెంట్‌ను పెంచుతోంది.
పాన్ ఇండియా ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న స‌లార్‌లో ప్ర‌భాస్ పాన్ ఇండియా అప్పీల్ ఇవ్వ‌నున్నారు. ఆయ‌న స‌ర‌స‌న శ్రుతీ హాస‌న్ హీరోయిన్‌. ఐదు భాష‌ల్లో సినిమా రూపొందుతోంది. ప్ర‌భాస్‌తో పాటు వెర్స‌టైల్ ఆర్టిస్ట్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో న‌టిస్తున్నారు. అలాగే జ‌గ‌ప‌తి బాబు, ఈశ్వ‌రీ రావు, శ్రియా రెడ్డి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. పాన్ ఇండియాలోనే సెన్సేష‌న‌ల్ క్రియేట్ చేసిన బాహుబ‌లి, కె.జి.య‌ఫ్ చిత్రాల కాంబినేష‌న్‌లో హోంబ‌లే ఫిలింస్ సినిమాను నిర్మిస్తోంది. బాహుబ‌లి హీరో, కె.జి.య‌ఫ్ ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, టెక్నీషియ‌న్స్ క‌ల‌యిక‌తో రానున్న స‌లార్ వ‌చ్చే ఏడాది మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ కానుంది. ఈ కాంబినేష‌న్‌ను ప్రేక్ష‌కులు అస్స‌లు మిస్ కార‌న‌టంలో సందేహ‌మే లేదు. భారీ అంచ‌నాల‌తో ప్ర‌భాస్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ నిర్మిస్తోన్న స‌లార్ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చే ఏడాది సెప్టెంబ‌ర్ 28న విడుద‌ల చేస్తున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

twenty − nine =