Happy Birthday Amitabh Bachchan: ఎవరెస్ట్‌ నటశిఖరం అమితాబ్!!

0
772
Happy Birthday Amitabh Bachchan:
Happy Birthday Amitabh Bachchan:

దేశమంతా అభిమానించే ఎవర్ గ్రీన్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌ ఈ రోజు 80వ పుట్టినరోజు (అక్టోబర్‌ 11) జరుపుకుంటున్నారు. బాలీవుడ్ బాద్ షా.. బిగ్ బి గా విశేష ప్రాచుర్యం పొందిన అమితాబ్ బచ్చన్ అంటే ఇప్పటికీ అందరికీ ఎంతో అభిమానం, ఆయన క్రేజ్, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియన్ సినిమా హిస్టరీలో అమితాబ్ పేరిట సపరేట్ అధ్యాయమే ఉంటుంది. అంతటి స్థాయిని అయన సంపాదించుకున్నారు. అమితాబ్ తన 80వ పుట్టినరోజు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. 80 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా ఉండటం, వివిధ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం ఆయనకే చెల్లింది. అక్టోబర్ 11న 80వ పుట్టిన రోజు జరుపుకుంటున్న అమితాబ్ బచ్చన్..ఇవాళ కూడా 40లో ఉన్నట్టే ఫిట్‌గా కనిపిస్తారు. దాదాపు 50 ఏళ్లుగా బాలీవుడ్ స్క్రీన్‌పై సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న అమితాబ్ బచ్చన్‌కు ఇప్పుడు కూడా పెద్దఎత్తున సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. మరోవైపు కౌన్ బనేగా క్రోర్‌పతి కార్యక్రమంతో బిజీ, ఇంకోవైపు భారీగా వాణిజ్య ప్రకటనలు. క్షణం తీరిక లేకుండా గడుపుతూనే ఉల్లాసంగా ఉంటున్నారు. 1969లో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన బిగ్‌బీ వినోద పరిశ్రమలోకి ప్రవేశించారు. ‘సాత్ హిందూస్థాన్’ అనే చిత్రం ద్వారా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి 1974 వరకు ఆయన నటించిన చిత్రాలు ప్రేక్షకాదరణ పొందలేదు. పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆదరణను సంపాదించుకోలేకోయాయి. 1973లో వచ్చిన ;’జంజీర్’ సినిమాతో అమితాబ్ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయారు. అక్కడి నుంచి అమితాబ్ వెనుదిరిగి చూసుకోలేకపోయారు. ఆయన 70వ దశకంలో నటించిన రౌటీ కపడా ఔర్ మకాన్, దీవార్, షోలే, చుప్కేచుప్కే, దో అంజానే, కబీ కబీ, అమర్ అక్బర్ ఆంథోని, త్రిషూల్, డాన్, ముకద్దర్‌ కా సికంద్దర్, మిస్టర్ నట్వర్ లాల్, సుహాగ్, కాలా పత్తర్, నసీబ్, లావారీస్, సిల్ సిలా, కాలియా, సత్తే పే సత్తే, అంధా కానున్, కూలీ చిత్రాలు ఆయనను సూపర్ స్టార్‌గా చేశాయి. బిగ్‌ బీ హవా 80వ దశకంలోను కొనసాగింది. షరాబీ, ఆఖరీ రాస్తా, షెహన్‌షా, ఇంక్విలాబ్ చిత్రాలు కాసులు పంట పడించాయి. 90వ దశకంలో అగ్నిపత్, హమ్, ఖుదా గవా, బెడీ మియా చోటే మియా, బీవీ నంబర్ 1, మొహబ్బతే, కభీ ఖుషీ, కభీ ఘమ్, భాగ్‌భన్ చిత్రాలు హిట్లు కొట్టాయి. ఇక 2000 తర్వాత కూడా అమితాబ్ హవా కొనసాగింది. బ్లాక్, వీర్ జారా, బంటీ ఔర్ బబ్లీ, చీనీ కమ్, సర్కార్, పికూ, పింక్, సైరా చిత్రాల మంచి ఆదరణ పొందాయి. అమితాబ్‌ బచ్చన్‌కు 1983లో కూలీ షూటింగ్ సమయంలో తీవ్ర ప్రమాదం చోటు చేసుకొన్నది. దాంతో ఆయనకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చికిత్స అందించారు. అయితే ఆయన ఆ సమయంలో మరణం అంచుల వరకు వెళ్లివచ్చారు. మృత్యువుతో పోరాటం చేసి ఆయన మృత్యుంజయుడిగా మారారు. కూలీ మూవీ తర్వాత మళ్లీ సూపర్ స్టార్‌గా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను రంజింప చేస్తున్నారు. అయితే అమితాబ్‌ ఓ దశలో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. అమితాబ్ బచ్చన్ కార్పోరేషన్ లిమిటెడ్ స్థాపించి సినీ నిర్మాణంలోకి అడుగపెట్టారు. ఆయన రూపొందించిన చిత్రాలు భారీ నష్టాలకు లోనయ్యాయి. దాంతో ఆయన ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో 2000 సంవత్సరంలో కౌన్ బనేగా కరోడ్ పతితో బుల్లితెర మీద ప్రత్యక్షమయ్యాడు. ఆయన హోస్ట్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమం భారీ సక్సెస్ సాధించింది. ఇప్పటికీ కేబీసీ కొనసాగడం గమనార్హం. గత ఐదు దశాబ్దాలుగా సినిమాలు, టెలివిజన్ రంగంలో సూపర్‌స్టార్‌గా అమితాబ్ కొనసాగుతున్నారు. బిగ్ బి హోదా అమితాబ్ బచ్చన్‌కు ఆషామాషీగా రాలేదు. జీవితంలో ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నారు. ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని..అందులోంచే తిరిగి పైకి లేచారు. టీబీ, లివర్ సిరోసిస్ వంటి వ్యాధులు చుట్టుముట్టినా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్నారు. లివర్ సిరోసిస్ కారణంగా 75 శాతం లివర్ దెబ్బతింది. 2019లో కరోనా మహమ్మారిని కూడా ఎదుర్కొన్నారు. బిగ్ బి ఆరోగ్యం కోసం చాలా నిష్టగా ఉంటారు. ముఖ్యంగా మద్యం, సిగరెట్ అలవాట్లకు దూరం పాటిస్తారు. ఉదయం, రాత్రి సమయాల్లో సాధారణ భోజనం తినడం అమితాబ్‌కు ఇష్టం. ఇక రోజూ ఉదయం వర్కవుట్స్, యోగా చేస్తారు. రోజుకు 20 నిమిషాలు వాకింగ్ క్రమం తప్పకుండా చేస్తారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ భోజనం చాలా సింపుల్‌గా ఉంటుంది. వర్కవుట్, యోగాతో దినచర్య ప్రారంభిస్తారు. ఆ తరువాత పండ్లు, డ్రైఫ్రూట్స్ తింటారు. బ్రేక్‌ఫాస్ట్‌లో ఎగ్‌భుర్జి, దలియా, బాదం, ప్రోటీన్ డ్రింక్ తీసుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్ అనంతరం కొన్ని మందులు, తులసి ఆకుల నీళ్లు, ఉసిరి జ్యూస్, కొబ్బరి నీళ్లు తప్పకుండా ఉండాల్సిందే. మద్యాహ్నం భోజనంలో పప్పు, కూరగాయలు, రోటీ ఉంటాయి. ఇక రాత్రి డిన్నర్‌లో పన్నీర్ భుర్జి లేదా సూప్ తీసుకుంటారు. బెంగాలీ స్వీట్స్ అంటే ఆయనకు చాలా ఇష్టం.
తెలుగు తెరపై అమితాబ్ కనిపించింది చాలా అరుదు. అయినా కూడా అమితాబ్ బచ్చన్ అంటే తెలియని ఇండియన్ ఉండడు. ఏ తరానికి చెందిన వ్యక్తి అయినా సరే.. అమితాబ్ పేరు వినని, సినిమా చూడని వ్యక్తి ఉండడు. గత ఐదారు దశాబ్దాలుగా ఇండియన్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేస్తూనే ఉన్నాడు. అయితే మధ్యలో అమితాబ్ చాలా డౌన్ ఫాల్ అయ్యాడు. అప్పుడు వెండితెరను వదిలేసి.. బుల్లితెర మీద దృష్టి పెట్టాడు. అలా కేబీసీ అంటూ జనాల్లో మరింత పాపులారిటీని సంపాదించుకున్నాడు. అలాంటి అమితాబ్ నేడు 80వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు. అమితాబ్ సినీ కెరీర్, పర్సనల్ లైఫ్, లవ్ స్టోరీలు, పెళ్లి ఇలా అన్నీ కూడా ఇంట్రెస్టింట్‌గానే ఉంటాయి. సినిమాల్లోకి రావడం, నిలదొక్కుకోవడం అమితాబ్‌కు అంత ఈజీగా ఏమీ జరగలేదు. ఆయన ఆహార్యాన్ని, ఎత్తుని, గొంతుని అందరూ హేళన చేసేవారు. అయినా పట్టుదలతో బాలీవుడ్‌కు పెద్ద దిక్కులా మారిపోయాడు. ఎన్నెన్నో క్లాసిక్స్, బ్లాక్ బస్టర్ హిట్లలో నటించాడు. అయితే అమితాబ్.. తాను చేసే సినిమా కోసం ప్రాణం పెట్టేస్తాడు. అలా ఓ సారి కూలీ సినిమా షూటింగ్‌లో అమితాబ్ తీవ్రంగా గాయపడ్డాడు. మళ్లీ ఇంటికి తిరిగి వస్తాడా? లేదా అని అందరూ అనుకున్నారు. కానీ అమితామ్ మొండి పట్టుదలే ఆయన్ను బతికించింది. అలా సినిమా షూటింగ్‌లో జరిగే ప్రమాదాలను అమితాబ్ ఎప్పుడూ ఖాతరు చేయలేదు. ఆయన పర్సనల్ లైఫ్ లవ్ స్టోరీలు, రేఖతో ప్రేమాయణం కూడా అందరికీ తెలిసిందే. రేఖతో పీకల్లోతు ప్రేమలో మునిగిన అమితాబ్.. చివరకు జయను చేసుకున్నాడు. సిల్వర్ స్క్రీన్ మీద అమితాబ్ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. ఆ టైంలో అమితాబ్ చాలా కింది స్థాయిలోకి వెళ్లిపోయాడు. అప్పుడే అమితాబ్ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. కౌన్ బనేగా కరోడ్ పతి అంటూ షోను రన్ చేశాడు.అది విపరీతంగా క్లిక్ అయింది. అలా ఇప్పటికీ పద్నాలుగు సీజన్లు అవుతోంది. అయినా దాని క్రేజ్ తగ్గలేదు. హోస్ట్‌గా అమితాబ్ మారలేదు. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూనే ప్రయోగాలకు పెద్ద పీట వేస్తున్నాడు. మన తెలుగు హీరోల్లో చిరంజీవి, నాగార్జున వంటి వారిపై అమితాబ్ మక్కువ చూపిస్తుంటాడు. అందుకే నాగార్జున మనం, చిరంజీవి సైరా సినిమాల్లో అమితాబ్ నటించాడు. అమితాబ్‌ బచ్చన్‌ పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేసిన, లెక్కలేనన్ని సినిమాలు అమితాబ్ లిస్ట్‌లో ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా నేటి యువ నటులతో పోటీపడుతుంటారు అమితాబ్‌. ఎందరో ఫిలిమ్‌ స్టార్‌‌లకు బిగ్‌బీ ఒక మార్గదర్శి. ఇప్పటికీ సినిమాలు, టి.వి షోలు చేస్తూ బీజీ లైఫ్‌ లీడ్‌ చేస్తున్నారు. ‘యాంగ్రీ యంగ్‌మేన్’గా పేరు తెచ్చుకున్న అమితాబ్‌ ఇప్పటికీ యంగ్‌మేన్‌లా యాక్టివ్‌గానే ఉంటారు. ఎనభై ఏళ్ల వయస్సులో ఇంత చురుగ్గా, ఎనర్జిటిక్‌గా, హెల్తీగా ఉన్న వ్యక్తిని ఎవరైనా చూశారా? ఖచ్చితంగా చూసుండం. అమితాబ్‌ ఎన్నో పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు, సర్జరీలను ఫేస్‌ చేశారు, బిగ్‌బీ ఫిట్‌గా ఉండేందుకు, జిమ్‌కు వెళ్లి వర్కవుట్స్‌ చేయడం, వెయిట్‌ లిఫ్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటివి ఏమి చేయరు. కేవలం సింపుల్‌ లైఫ్‌ లీడ్‌ చేస్తారు, సాదాసీదా ఆహారం తీసుకుంటారు, వాకింగ్‌, చిన్న చిన్న వ్యాయమాలు మాత్రమే చేస్తారు. తనకు చాట్‌ అంటే ఇష్టమని కౌన్ బనేగా కరోడ్‌పతి ఎపిసోడ్‌లో అమితాబ్ చెప్పారు. దిల్లీలోని బెంగాలీ స్వీట్ హౌస్‌లో రకరకాలు చాట్‌‌లను ఎంజాయ్ చేసేవాడినని చెప్పాడు. అమితాబ్ రాత్రిపూట లైట్‌గా ఉండే ఆహారాన్ని ఇష్టపడతారు. నైట్‌ డిన్నర్‌లో సూప్‌ తీసుకుంటారు. కొన్నిసార్లు నైట్‌ డైట్‌లో పనీర్ భుర్జీ ఉంటుంది.

అమితాబ్‌కు మెగాస్టార్ చిరంజివి స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌

బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ ఈరోజు 80వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మంగళవారం(అక్టోబర్‌ 11న) ఆయన బర్త్‌డే సందర్భంగా సోషల్‌ మీడియా మొత్తం బిగ్‌బి బర్త్‌డే విషెస్‌తో నిండిపోయింది. అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు అయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి కూడా బాలీవుడ్‌ మెగాస్టార్‌కు స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ఈ సందర్భంగా చిరు ట్వీట్‌ చేస్తూ నటులందరిలో మీరు ఎవరెస్ట్‌ శిఖరం అంటూ ప్రశంసించారు. 80వ పుట్టిన రోజు శుభకాంక్షలు గురూజీ(బచ్చన్‌ సార్‌) మీకు మరింత శక్తి, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ సర్వశక్తవంతుడిని ప్రార్థిస్తున్నా. నటులందరిలో మీరు ఎవరెస్ట్‌ శిఖరంలా ఉన్నారు. మీ ప్రతిభ, విజయాల పట్ల మేమంతా విస్మయం చెందుతున్నాము. మీకు మరింత శక్తి అమిత్‌ జీ’ అంటూ చిరు రాసుకొచ్చారు. ఈ సందర్భంగా సైరా నరసింహారెడ్డి చిత్రం సమయంలో అమితాబ్‌ దిగిన ఫొటోలను ఆయన షేర్‌ చేశారు. భారతీయ నటశిఖరం అమితాబ్ బచ్చన్ 1942లో ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అక్టోబర్ 11వ తేదీన జన్మించారు. అమితాబ్‌ను అభిమానులు బిగ్‌బీ, యాంగ్రీ యంగ్ మ్యాన్, బాలీవుడ్ షెహన్‌షా అని ముద్దుగా పిలుచుకొంటారు. 80 పుట్టిన రోజున జరుపుకొంటున్న అమితాబ్ బచ్చన్‌కు చిరంజీవి, ఇతర సినీ ప్రముఖులు విషెస్ అందించారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

four × five =