More

    హనుమంతుడి గుడి పూజారిని దారుణంగా హత్య చేశారు

    సోమవారం రాత్రి (నవంబర్ 29, 2021) రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాలో హనుమంతుడి ఆలయంలో నిద్రిస్తున్న పూజారిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు పూజారిపై కత్తితో దాడి చేసి.. చీరతో గొంతు బిగించి హత్య చేయడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మధ్యాహ్నం 2 గంటలకు జరిగింది. వృద్ధ పూజారి కేకలు వేయడంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన పూజారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూజారి చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించాడు.

    చనిపోయిన పూజారి గత 30 ఏళ్లుగా గుడిసెలో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం పోలీసులు హత్య కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన జాలోర్ జిల్లాలోని బగోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని దుంబాడియా గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం దుంబాడియా గ్రామానికి చెందిన నేనుదాస్ వైష్ణవ్ (70) గత 30 ఏళ్లుగా హనుమాన్ ఆలయంలో సేవ చేస్తూ గుడిసెలో నివాసం ఉంటున్నాడు. సోమవారం కూడా యథావిధిగా పూజలు ముగించుకుని నిద్రపోయాడు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కొందరు దుండగులు దొంగతనం చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చారు. అంతలో పూజారికి మెలుకువ వచ్చింది.. వెంటనే దుండగులు పూజారిని తన్నడం, కొట్టడం వంటివి చేయడమే కాకుండా.. కత్తులు, రాళ్లతో దాడి చేశారు. ఘటన జరిగినప్పటి నుంచి అక్కడ ఉంచిన హుండీ కూడా కనిపించకుండా పోయింది.

    ఈ కేసులో అర్చకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు డీఎస్పీ (భీన్మల్) శంకర్ లాల్ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు పలు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

    70-year-old priest of Hanuman temple killed in Rajasthan

    Trending Stories

    Related Stories