International

హనుమంతుడి ఆలయం ధ్వంసం.. బంగారం, హుండీలో డబ్బులు కూడా ఎత్తుకుపోయారు

పాకిస్థాన్ లో హిందువులకు ఏ మాత్రం రక్షణ లేదన్న సంగతి తెలిసిందే..! ఇక ఇటీవలి కాలంలో హిందూ ఆలయాలపై కూడా దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. హిందూ పండుగ దీపావళికి ముందు.. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని కోత్రి ప్రాంతంలోని చారిత్రాత్మక పంచముఖి హనుమాన్ ఆలయాన్ని కొందరు దుండగులు అపవిత్రం చేసి ధ్వంసం చేశారు. పాక్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. కొందరు వ్యక్తులు హనుమాన్ మందిర్‌లోకి ప్రవేశించి, ఆలయంలోని విగ్రహాలను అపవిత్రం చేయడమే కాకుండా.. నగదు మరియు నగలను అపహరించారు.

గురువారం ఆలయంపై దాడి చేసిన దొంగలు హిందూ దేవుళ్ల విగ్రహాల నుంచి సుమారు 40,000 పాక్ రూపాయల విలువైన రెండు వెండి నెక్లెస్‌లను అపహరించడంతో పాటు, హుండీ పెట్టెలోని 20,000 రూపాయల విలువైన నగదును అపహరించారు. సింధ్ సిఎం హౌస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. దొంగ మందిరం పైకప్పు నుండి ప్రవేశించి, నెక్లెస్లను అపహరించాడు. విగ్రహాలను గాజు ఫ్రేమ్‌లో భద్రపరచబడి ఉండగా.. వెండితో చేసిన రెండు హారాలు వాటికి ఉన్నాయి. రెండు నెక్లెస్‌ల విలువ పాక్ రూ.40,000 ఉంటుందని సమాచారం. హుండీలోని రూ.20,000 నగదును కూడా దొంగ ఎత్తుకెళ్లాడు. దొంగలు దేవి మాత కిరీటాన్ని కూడా తీసివేసి, ఎత్తుకెళ్లారు. పాకిస్థాన్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చైర్మన్ చెలారామ్ కెవ్లానీ, సింధ్ మైనారిటీల మంత్రి గియాన్ చంద్ ఎస్సారానీ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

పాకిస్థాన్ శిక్షాస్మృతి 295, 297, 380 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. పాకిస్థాన్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చైర్మన్ చెలారామ్ కెవ్లానీ, సింధ్ మైనారిటీల మంత్రి గియాన్ చంద్ ఎస్సారానీ కూడా ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ విషయాన్ని మొదట ‘వాయిస్ ఆఫ్ పాకిస్థాన్ మైనారిటీ’ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేశారు. “ఇది మళ్లీ ప్రారంభమైంది. #దీపావళి2021కి కొన్ని రోజుల ముందు #హిందూ సమాజాన్ని మరియు వారి దేవతలపై దాడులు మొదలయ్యాయి. సింధ్‌లోని కోత్రిలో ఉన్న ఒక చారిత్రాత్మక దేవాలయంపై మతోన్మాదులు దాడి చేసి ధ్వంసం చేశారు” అని ట్వీట్ చేశారు. ‘వాయిస్ ఆఫ్ పాకిస్థాన్ మైనారిటీ’ ట్విట్టర్ హ్యాండిల్ లో ఆలయ ప్రాంగణాన్ని ఎంతగా అపవిత్రం చేశారో చిత్రాలను కూడా షేర్ చేశారు. పోలీసులు ఒక దొంగల పని అని చెబుతున్నా.. అక్కడ చోటు చేసుకున్న ఘటనలు చూస్తుంటే కావాలనే ఆలయంపై దాడి చేసినట్లు స్పష్టమవుతోంది.

దుండగులు ఆలయాన్ని ధ్వంసం చేయడమే కాకుండా.. ఆలయ ప్రాంగణంలోని విలువైన వస్తువులను దోచుకున్నారని పాకిస్థాన్‌కు చెందిన జర్నలిస్ట్ నైలా ఇనాయత్ తెలిపారు. కొట్రీలోని హిందూ దేవాలయాన్ని అపవిత్రం చేసి, దేవి మాత కిరీటం, దేవతల విగ్రహాల నుండి పాక్ రూ.40,000 విలువైన వెండి నెక్లెస్‌లు, ఆలయంలోని హుండీ పెట్టె నుండి రూ. 25,000 దొంగలు దొంగిలించారని ఆమె చెప్పారు.

హిందూ దేవాలయంపై దాడిని అకాలీదళ్ నేత మంజీందర్ సింగ్ సిర్సా ఖండించారు. పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్‌లోని కోత్రిలో ఒక హిందూ దేవాలయం దీపావళికి ముందు ధ్వంసమైంది.. అధికారుల నుండి ఎటువంటి స్పందన కూడా లేదు. మతపరమైన తీవ్రవాదం, మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని దాడుల్లో పాకిస్థాన్ లో తారా స్థాయికి చేరుకుంది. ఈ విషయాన్ని పాకిస్థాన్‌తో చర్చించి హిందువుల భద్రతకు భరోసా ఇవ్వాలని కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్‌ను ఆయన కోరారు. పంచముఖి హనుమాన్ ఆలయంలో దొంగిలించబడిన విలువైన వస్తువుల గురించి ఒక వ్యక్తి వివరిస్తున్న వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. ఆలయంపై దాడి చేసి శ్రీరాముని కిరీటంను తీసుకుని వెళ్లారని వివరించారు.

పాకిస్థాన్ లో హిందూ దేవాలయాలపై దాడులు నిత్యకృత్యం అయ్యాయి. ఆగస్టు 30న పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని సంఘర్ జిల్లాలో ఖిప్రోలో కొందరు మతోన్మాదులు హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసి, కృష్ణుడి విగ్రహాన్ని పగలగొట్టారు. స్థానికులు ఆలయంలో జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటుండగా ఈ ఘటన జరిగింది. శ్రీకృష్ణుడి విగ్రహానికి చేతులు, కాలు విరగ్గొట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

8 − four =

Back to top button