Telugu States

తెలంగాణలో సూర్యుడి చుట్టూ వలయం.. ఏపీకి వర్ష సూచన

కొద్దిరోజుల కిందట కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏర్పడ్డట్టుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణలో పలుచోట్ల ఆకాశంలో సూర్యుడి చుట్టూ ఇంద్రధనుస్సు మాదిరిగా వలయం కనిపించింది. దీన్ని చూసిన ప్రజలు.. తమ కెమెరాలను క్లిక్ మనిపించారు. దట్టమైన మేఘాలు ఏర్పడినప్పుడు వాటిలో ఘనీభవించిన నీటి బిందువులు ఉంటాయని… వాటిపై సూర్యకిరణాలు పడినప్పుడు ఇలాంటి దృశ్యం ఆవిష్కృతమవుతుందని నిపుణులు తెలిపారు. మంచు బిందువులపై పడిన సూర్యకిరణాలు పరావర్తనం చెంది ఇంద్రధనుస్సు రంగుల్లో కనిపిస్తాయి. సూర్యుడు లేదా చంద్రుడి చుట్టూ ఇలాంటి వలయాకారాలు ఏర్పడటం వర్షానికి లేదా మంచు కురవడానికి సూచికగా భావించవచ్చని చెప్పారు.

Image

సైంటిఫిక్ పరిభాషలో వీటిని 22-డిగ్రీ హలోస్ అంటారని చెప్పారు. ఈ వలయాలకు సుమారు 22 డిగ్రీల వ్యాసార్ధం ఉంటుంది. హాలో అనేది సూర్యుడు లేదా చంద్రుడి నుండి 22-డిగ్రీల కాంతి వలయం. ఇది షట్కోణ మంచు స్ఫటికాలతో ఏర్పడే అత్యంత సాధారణమైన కాంతి కారకం. మేఘాలలో మిలియన్ల చిన్న మంచు స్ఫటికాలు ఉంటాయి. ఇవి వృత్తాకార ఇంద్రధనస్సు రింగ్ ముద్రను ఇవ్వడానికి కాంతిని వక్రీకరిస్తాయి. కాంతిని విభజించి ప్రతిబింబిస్తాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు హైదరాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో సూర్యుడి చుట్టూ వలయం స్పష్టంగా కనిపించింది.

Image

మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని, ఇవి క్రమంగా బలపడుతుండడంతో వాటి ప్రభావం రాష్ట్రంపైనా ఉంటుందని అన్నారు. ఉత్తర కోస్తాంధ్రలో రేపటి నుంచి మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తాంధ్రలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × five =

Back to top button