మహమ్మారి సోకి రెండేళ్లయినా ఏదో ఒక ఇబ్బంది తప్పదట

0
727

COVID-19 బారిన పడిన రెండు సంవత్సరాల తరువాత.. కోలుకున్నాక కూడా ఇబ్బందులు తప్పవట..! ఇన్‌ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరిన వారిలో సగం మందికి కనీసం ఏదో ఒక లక్షణం కొనసాగుతూనే ఉందని, ఇబ్బందులు పడుతూనే ఉన్నారని మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’ అధ్యయనం తెలిపింది. లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ ఒక అధ్యయనంలో COVID-19 నుండి కోలుకున్న వ్యక్తులలో చాలా మంది అవయవాలు, వ్యవస్థలపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతాయని రుజువులు ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.

చాలా మంది కరోనా బాధితులు వ్యాధి తీవ్రతతో సంబంధం లేకుండా శారీరకంగా, మానసికంగా కోలుకున్నారని.. ఈ రెండేళ్లలో చాలా మంది తిరిగి తమ విధుల్లో చేరిపోయారు కూడా అని పరిశోధకులు వెల్లడించారు. అయితే, కొందరిలో మాత్రం కరోనా లక్షణాలు ప్రభావం చూపుతూనే ఉన్నాయని అన్నారు. సాధారణ వ్యక్తులతో పోలిస్తే కరోనా బాధితులు తక్కువ ఆరోగ్యంతో ఉన్నారని.. వీరిలో చాలా మంది రెండేళ్లు దాటినా ఇప్పటికీ అలసట, కండరాల నొప్పి, నిద్రలేమి, శ్వాస సంబంధ సమస్యలు వంటి సమస్యలతో బాధపడుతున్నారని ఆ అధ్యయనం వివరించింది. దీర్ఘకాల కరోనా వ్యాధి కారకాన్ని తెలుసుకునేందుకు మరిన్ని అధ్యయనాలు చేయాల్సి ఉందని, దీర్ఘకాల కరోనా ముప్పును తగ్గించేందుకు సమర్థవంతమైన వ్యూహాలను రూపొందించాల్సి వుందని తేలింది. ప్రజా ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదముందని పేర్కొంది. ఇప్పటివరకు కరోనా నుండి కొలుకున్న వ్యక్తుల సంఖ్యకు సమానంగా పలువురిలో వస్తున్న ఆరోగ్య సమస్యలు వారిపై సామాజిక, ఆర్థిక భారం కలిగించవచ్చని తెలిపింది. సమర్థవంతమైన చికిత్సలు లేకపోవడంతో దీర్ఘకాల కరోనా కొత్త ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉందని లాన్సెట్‌ హెచ్చరించింది.