More

  హలాల్.. ఓ ఆర్థిక జిహాద్..!

  ఏ చికెన్‌ సెంటర్ కు వెళ్లినా హలాల్ పేరు కనిపిస్తుంది. ‌మటన్‌ ‌షాపుల్లోనూ హలాల్ పేరే వినిపిస్తుంది. ‌ఫుడ్‌ ‌కోర్టుల్లో, రెస్టారెంట్లలో హలాల్ మాంసాన్నే వడ్డిస్తారు. చివరికి ఫుడ్ డెలివరీ యాప్స్, విమానాల్లోనూ కూడా హలాల్ మాంసాహారాన్నే అందిస్తారు. ఇష్టం వున్నా లేకున్నా.. హిందువులైనా, సిక్కులైనా, క్రిస్టియన్లైనా.. ముస్లిమేతర మతస్తులెవరైనా హలాల్ మాంసాన్ని తినాల్సిన దుస్థితి నెలకొంది. కొద్ది నెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం మాంసం ఎగుమతులకు హలాల్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదని కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. మాంసాహార వ్యాపారంలో ముస్లిమేతరులను అణగదొక్కుతున్న హలాల్ నిబంధనకు చెక్ పెట్టింది. నిజానికి, ముస్లింలకే పరిమితమైన హలాల్ సంప్రదాయాన్ని ఇతర మతస్తులు అనుసరించాల్సిన అవసరం లేదు. కానీ, మెజారిటీ హిందువులు ఉండే సంస్థలు సైతం హలాల్ మాంసాన్నే వాడుతున్నాయి. మాంసాహార వ్యాపారంలో ముస్లింల గుత్తాధిపత్యానికి దాసోహమంటున్నాయి. చివరికి మెజారిటీ హిందూ విద్యార్థులున్న స్కూళ్లలో సైతం హలాల్ మాంసాన్నే వండి వడ్డిస్తున్నారంటే.. పరిస్థితి ఎంత దిజగారిందో అర్థం చేసుకోవచ్చు. డెహ్రాడూన్ లో తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది.

  జూన్ 26న డెహ్రాడూన్ లోని ఓ స్థానిక వార్తాపత్రికలో ఒక టెండర్ నోటీస్ అచ్చయింది. పిల్లలకు కావాల్సిన ఆహార పదార్థాల కోసం.. డెహ్రాడూన్ లోని ప్రముఖ బోర్డింగ్ స్కూల్ అయిన.. వెల్ హామ్ బాయ్స్ స్కూల్ యాజమాన్యం ఇచ్చిన ప్రకటన అది. మాంసాహారం, కూరగాయలు, పాల పదర్థాలు, బేకరీ ఐటమ్స్.. ఇలా పలు రకాలైన ఆహార పదార్థల సప్లయర్స్ కోసం.. స్కూల్ యాజమాన్యం టెండర్లు పిలిచింది. ఇంతవరకు బాగానే వుంది. కానీ, కేవలం హలాల్ మాంసాన్ని మాత్రమే సరఫరా చేయాలంటూ.. టెండర్ నోటీసులో ప్రత్యేకంగా పేర్కోవడం వివాదానికి దారితీసింది. ఓవైపు మాంసాహార ఎగుమతులు, అమ్మకాల్లో ‘హలాల్’ సర్టిఫికేషన్ తప్పనసరి కాదని ప్రభుత్వం చెబుతుంటే.. ఇలా ఓ స్కూల్ యాజమాన్యం కేవలం ‘హలాల్’ మాంసం కోసం టెండర్లు పిలవడం విమర్శలకు తావిచ్చింది. వెల్ హమ్ బాయ్స్ స్కూల్ తీరు పట్ల పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ బజరంగ్ దళ్ డెహ్రాడూన్ విభాగం ఆందోళనకు దిగింది. బజరంగ్ దళ్ కార్యకర్తలు పాఠశాల ఆవరణంలో నిరసన వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యం టెండర్ నోటీసును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  మెజారిటీ హిందువులు చదువుతున్న స్కూల్ లో ‘హలాల్’ మాంసాన్ని ఎలా వడ్డిస్తారని.. డెహ్రాడూన్ బజరంగ్ దళ్ కన్వీనర్ వికాస్ వర్మ మండిపడ్డారు. వెల్ హమ్ స్కూల్ యాజమాన్యం.. ముస్లిం కసాయి పద్దతుల్లో వధించే జంతుమాంసాన్ని.. హిందూ విద్యార్థులకు ఎందుకు ఇవ్వాలనుకుంటుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

  అంతేకాదు, వెల్‎హమ్ స్కూల్ టెండర్ నోటీసుపై డెహ్రాడూన్‎లోని దలన్‎వాలా పోలీస్ స్టేషన్‎లో బజరంగ్ దళ్ ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రికి కూడా లేఖ రాసింది. స్కూల్‎లో అన్ని మాతాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారని.. అయినా కేవలం హలాల్ మాంసాన్ని అందిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హలాల్ మాంసానికి టెండర్లు పిలవడమంటే హిందూ విద్యార్థులను, హిందూ మతాన్ని అవహేళన చేయడమేనని బజరంగ్ దళ్ అభిప్రాయపడిన బజరంగ్ దళ్.. వెల్ హమ్ స్కూల్ యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. టెండర్‎ను వెనక్కి పిలిచేలా చర్యలు చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒకవేళ స్కూల్ యాజమాన్యంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే.. ఆందోళన మరింత ఉధృతం చేస్తామని.. డెహ్రాడూన్ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని బజరంగ్ దళ్ హెచ్చరించింది. వెల్ హమ్ స్కూల్ చర్య మత ఉద్రిక్తతలను పెంచే విధంగా వుందని.. బజరంగ్ దళ్ సిటీ కన్వీనర్ వికాస్ వర్మ అభిప్రాయపడ్డారు.

  ఇదిలావుంటే, బజరంగ్ దళ్ సభ్యలు టెండర్ గురించి నిలదీసినప్పుడు.. స్కూల్ యాజమాన్యం పొంతనలేని సమాధానాలు చెప్పింది. స్కూల్ స్టాఫ్ దగ్గర్నుంచి ఒకలా.. యాజమాన్యం నుంచి మరోలా సమాధానాలు వచ్చాయి. స్కూల్ లో హలాల్, జట్కా రెండు రకాల మాంసాహారాన్ని వడ్డిస్తామని మేనేజ్ మెంట్ సభ్యులు చెబితే.. ప్రస్తుతానికి హలాల్ మాంసానికి మాత్రమే టెండర్లు పిలిచామని.. త్వరలో జట్కా మాంసానికి కూడా టెండర్లు వేస్తామని స్కూల్ వైస్ ప్రిన్సిపల్ మహేష్ కండ్ పాల్ తెలిపారు. ఇక, స్కూల్ ప్రిన్సిపల్ జగ్రాన్ నుంచి మరో ఆశ్చర్యకరమైన సమాధానం వచ్చింది. వారంలో మూడు రోజులు హలాల్ మాంసాన్ని, మరో మూడు రోజులు జట్కా మాంసాన్ని వడ్డిస్తామని చెప్పారామె. రెండు రకాల మాంసాన్ని సప్లయి చేసేందుకు.. ప్రత్యేక సప్లయర్లు ఉన్నారని తెలిపారు. కానీ, బజరంగ్ దళ్ సేకరించిన స్కూల్ టెండర్ నోటీసులో హలాల్ మటన్‎తో పాటు.. బ్రెడ్, పప్పులు, బియ్యం, కూరగాయలు వంటివి మాత్రమే ఉన్నాయి. ఇలా అన్ని రకాల ఆహార పదార్థాలకు ఒకే టెండర్ నోటీస్ ఇచ్చినప్పుడు.. కేవలం జట్కా మాంసానికి మాత్రం ప్రత్యేకంగా టెండర్ ఎందుకు పిలిచారనేది వెయ్యిడాలర్ల ప్రశ్న. అయినా.. జట్కా మాంసానికి సంబంధించిన టెండర్ నోటీసు చూపించమని అడినప్పుడు స్కూల్ యాజమాన్యం నీళ్లు నమిలింది. దీనినిబట్టి వెల్ హమ్ స్కూల్ యాజమాన్యం చెబుతున్నవన్నీ కట్టుకథలేనని తేలిపోయింది.

  ఇంత జరిగినా స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకునేందుకు మొదట డెహ్రాడూన్ పోలీసులు సంకోచించారు. పాఠశాలపై కేసు పెట్టడానికి చట్టం ప్రకారం ఎలాంటి నిబంధనలు లేవని చెప్పారు. అయితే, బజరంగ్ దళ్ ఆందోళనలతో ఎట్టకేలకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. వెల్ హమ్ బాయ్స్ స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వర్గాల మధ్య శత్రుత్వాన్ని రగిలించడం, ద్వేషాన్ని రెచ్చగొట్టడం వంటి చర్యలకు సంబంధించిన.. ఐపీసీ సెక్షన్ 502-2 కింద కేసు రిజిస్టర్ చేశారు. హలాల్ కు వంతపాడుతున్న వెల్ హమ్ స్కూల్ యాజమాన్యంపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం పట్ల వీహెచ్పీ డెహ్రాడూన్ కన్వీనర్ వికాస్ వర్మ హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ సత్యం గెలిచిందన్నారు. హలాల్ గుత్తాధిపత్యం పూర్తిగా ముగిసేవరకు ఈ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

  ప్రజలు సైతం హలాల్ మాంసాన్ని ప్రోత్సహించే రెస్టారెంట్లలో తినకూడదని అన్నారు వికాస్. హలాల్ మాంసాహారాన్ని మాత్రమే విక్రయిస్తూ.. హిందువులు, సిక్కుల పట్ల వివక్ష చూపుతున్న సంస్థలను, రెస్టారెంట్లను నిషేధించాలన్నారు. హలాల్ మాంసం మాత్రమే విక్రయిస్తున్న రెస్టారెంట్లను, ఫుడ్ కోర్టులను గుర్తించేందుకు ఆయన.. ఓ చిన్న టెక్నిక్ సూచిస్తున్నారు. జట్కా మాంసంతో చేసిన డిష్ ను సదరు యజమానులను ఆఫర్ చేయాలని.. ఒకవేళ, వారు దానిని తినడానికి నిరాకరిస్తే.. అలాంటి సంస్థలు, రెస్టారెంట్లలో ఎప్పుడూ తినకూడదని సలహా ఇస్తున్నారు. హలాల్ అంటే ఏమిటో తెలుసుకునేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు వికాస్. ఎవరైనా హలాల్ పద్దతి గురించి శోధిస్తే.. ఆ ప్రక్రియ జంతువుకు ఎంత నరకప్రాయమో అర్థమవుతుందని అన్నారు. ముస్లిమేతర సంస్థలు, రెస్టారెంట్లపై హలాల్ బలవంతంగా హలాల్ ముద్రను రుద్దాలని చూస్తే.. ఊరుకోబోమని.. అవసరమైతే పెద్దయెత్తున ఉద్యమం చేస్తామని వికాస్ వర్మ హెచ్చరించారు.

  దేశంలోని గల్లీ హోటల్ నుంచి మొదలు పెడితే.. ఫైవ్ స్టార్ హోటల్ వరకు హలాల్ మాంసమే లభిస్తుంది. జట్కా మాంసం కావాలని అడిగితే చిత్రవిచిత్రంగా చూసే రోజులివి. ముస్లిమేతర సంస్థలు, రెస్టారెంట్లు కూడా కేవలం హలాల్ మాంసానికి అనుకూలంగా పక్షపాతం చూపడం వల్ల.. హిందువులు, సిక్కుల్లోని కసాయి సమాజం ఉపాధి కోల్పోతోంది. ముస్లింలు ఎక్కువగా వున్న హలాల్ మాంసం సప్లయర్లకు తమ వ్యాపారాన్ని వదులుకోవాల్సి వస్తోంది. హిందువులు, సిక్కుల్లో దేశవ్యాప్తంగా 40 లక్షల మంది కసాయి వృత్తివారు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. దేశంలో ఇనిస్టిట్యూట్లు, రెస్టారెంట్లు, ఇతర సంస్థలు, కేవలం హలాల్ మాంసాన్ని మాత్రమే ప్రోత్సహించడం వల్ల ఈ వర్గాలకు హాని జరుగుతోంది. దీంతో హిందువులు, సిక్కులు హలాల్ మాంసాన్ని నిషేధించాల్సిన అవసరం వుందని బజరంగ్ దళ్ వంటి సంస్థలు ఎప్పటినుంచో ఆందోళన చేస్తున్నాయి.

  నిజానికి, కొన్నేళ్లుగా హలాల్ చేసిన మాంసాహారానికి వ్యతిరేకంగా హిందులు, సిక్కులు గొంతు విప్పుతున్నారు. అయితే, ఆశ్చర్యకరంగా హలాల్ అనేది ఇప్పుడు మాంసాహారానికే పరిమితం కాలేదు. శాఖాహార పదార్థాలకు కూడా పాకిపోయింది. బిస్కెట్లు, బియ్యం, పలు రకాల పిండి పదార్థాలపైనా హలాల్ ముద్ర కనిపిస్తోంది. నిజానికి, హలాల్ అనేది ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు కాదు. కానీ, దీనిని చట్టపరమైన గుర్తింపులాగా చెలామణి అవుతోంది. ఇస్లాంతో ఎలాంటి సంబంధం లేని ఉత్పత్తులు, సేవలకు కూడా హలాల్ సర్టిఫికెట్లను ఉపయోగిస్తున్నారు. తాము ఇస్లాం పద్దతులను అనుసరిస్తున్నామని చెప్పుకోవడానికి ఇలా చేస్తున్నారు. అవసరం లేకపోయినా హలాల్ ను పాటిస్తూ.. ఇతర మతాలకు చెందిన వినియోగదారుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు.

  నిజానికి, హలాల్ అనేది జంతు వధకు సంబంధించిన ఇస్లాం సంప్రదాయం. తప్పనిసరిగా హలాల్ మాంసాన్నే తినాలని ఇస్లాం బోధిస్తుంది. కాబట్టి హలాల్ సర్టిఫికేషన్ వ్యాపారం ద్వారా లబ్దిపొందేది కేవలం ముస్లింలు మాత్రమేననడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హలాల్ ను నిర్వహించేది కూడా ముస్లిం వ్యక్తులే కాబట్టి.. హలాల్ పాటిస్తున్న సంస్థల్లో ముస్లిమేతరులకు ఉపాధి లభించదు. ఇలా మాంసాహార పరిశ్రమపై ముస్లింల ఆజమాయిషీ వల్ల హిందువులు, సిక్కులు ఉపాధి కోల్పోవాల్సి వస్తోంది. ఈ సమస్యపై హిందువులు, సిక్కులు, ఇతర ముస్లిమేతర వర్గాలు దృష్టిసారిస్తున్నాయి. అక్కడక్కడా హలాల్ కు వ్యతిరేకంగా గళం విప్పడం కనిపిస్తోంది.

  కొద్ది నెలల క్రితం ఒక హిందూ యువకుడు ఆహారం కోసం ‘జొమాటో ఫుడ్‌ ‌యాప్‌’ ‌లో ఆర్డర్‌ ఇచ్చాడు. డెలివరీ ఇచ్చేందుకు వేరే మతస్తుడు వచ్చినందుకు ఆ యువకుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీనికి జొమాటో స్పందిస్తూ ‘ఆహారానికి మతం లేదు’ అని ట్వీట్‌ ‌చేసింది. జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్‌ ‌గోయల్‌ ‌కూడా స్పందిస్తూ ‘మేం అనుసరించే విలువలకు విరుద్ధంగా వ్యాపారం జరగాలంటే, దాన్ని కోల్పోయేందుకు కూడా మేం చింతించం’ అంటూ రిప్లయి ఇచ్చారు. ఈ విషయంపై సోషల్‌ ‌మీడియాలో చర్చలు, వాగ్వా దాలు జరిగాయి. కొందరు హిందూ యువకుడిని సమర్థిస్తే, మరి కొందరు జొమాటోనే వెనుకేసుకొచ్చారు. ఇక్కడ ఒక కీలకమైన విషయం అందరినీ ఆలోచింపజేసింది. తిండికి మతం లేదని గొప్పగా చెబుతున్న జొమాటో తాము అందించే మాంసాహారం ‘హలాల్‌’ అని ఎందుకు ప్రత్యేకంగా చెబుతోంది? ముస్లిం ఆచారం ప్రకారం హలాల్‌ ‌చేసిన ఆహారం అందిస్తున్న ఈ సంస్థ హిందువులు, సిక్కులు పాటించే ‘జట్కా’ ఆచారం ప్రకారం ఆహారాన్ని ఎందుకు అందించడం లేదు? సోషల్‌ ‌మీడియాలో వచ్చిన ఈ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైన జొమాటో, వినియోగదారులు కోరుకుంటే జట్కా మాంసం ట్యాగ్‌ను తీసుకు వచ్చేం దుకు అభ్యంతరం లేదని స్పష్టం చేయక తప్పలేదు.

  ఇండిగో ఎయిర్‌లైన్స్ ‌తమ విమానాల్లో వడ్డించే మాంసాహార ప్యాకెట్‌పై ‘హలాల్‌’ ‌ముద్రను చూసిన ఓ ప్రయాణికుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. హలాల్‌ ‌చేసిన మాంసం వడ్డించడం ద్వారా హిందువుల, సిక్కుల మనోభావాలను ఇండిగో యాజమాన్యం దెబ్బతీసిందంటూ సోషల్‌ ‌మీడియాలో నిరసన మొదలైంది. ఇండిగో విమానాల్లో హలాల్‌ ‌నిషేధించండి, లేదంటే హిందువుల నుంచి నిషేధం ఎదుర్కొంటారని హెచ్చరికలు వచ్చాయి. ఓ ప్రయాణికుడు ‘ఇండిగోలో హలాల్‌ ‌చేసిన మాంసాన్ని వడ్డించడాన్ని మీరు సమర్థిస్తారా’ అని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ ‌సింగ్‌ ‌పూరీని ట్యాగ్‌ ‌చేస్తూ ట్వీట్‌ ‌చేశాడు. దీంతో ఆయన ‘హలాల్‌ ‌చేసిన మాంసాన్ని హిందువులు, సిక్కులు ఎలా తింటారని అనుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు.

  ఇక, 2021 జనవరిలో దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఓ నిబంధనను అమల్లోకి తెచ్చింది. దక్షిణ ఢిల్లీలోని రెస్టారెంట్లు, రిటైల్ మాంసం వ్యాపారులు.. తాము ఎలాంటి మాంసాన్ని విక్రయిస్తున్నారో తప్పనిసరిగా ప్రదర్శించాలని నిబంధన విధించింది. సరిగ్గా అదే నెలలో కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా నాన్ హలాల్ రెస్టారెంట్ తెరిచారు. అటు క్రిస్టియన్లు సైతం హలాల్ కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. మార్కెట్లలో అంతకంతకూ పెరుగుతున్న హలాల్ ఉత్పత్తులు, ఇస్లాం ఆర్థిక విస్తరణవాదంపై.. 2020 సెప్టెంబర్ లో విశ్వ హిందూ పరిషద్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని హిందూ సమజాన్ని హెచ్చరించింది. ముస్లిమేతర వర్గాల్లో హలాల్ కు ఇప్పుడిప్పుడే వ్యతిరేక గళం వినిపిస్తున్నా.. దానిని అడ్డుకోవడానికి ఇంకా చేయాల్సివుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

  Trending Stories

  Related Stories