More

    జ్ఞానవాపి కేసులో కీలక మలుపు..! ‘కార్బన్ డేటింగ్‎’పై హైకోర్టు ఏం చెప్పిందంటే..!

    జ్ఞానవాపి విషయంలో మరో ముందడుగు పడింది. కొద్దిరోజుల క్రితం మసీదులో లభించిన శివలింగానికి కార్భన్ డేటింగ్ నిర్వహించాలన్న పిటిషన్‎ను వారణాసి జిల్లా కోర్టు తిరస్కరించింది. దీంతో అప్పట్లోనే హిందూ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ లక్ష్మీదేవితోపాటు మరో ముగ్గురు మహిళా భక్తులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు దీనిపై విచారణ జరుపుతామని తెలిపింది. దీనికి సంబంధించి ప్రతివాది అంజుమన్ ఇంతెజామియా కమిటీకి నోటీసులు జారీ చేసింది. దీంతో మరికొన్ని రోజుల్లో అలహాబాద్ ఈ పిటిషన్ పై విచారణ జరపనుంది.

    గతంలోనే శివలింగంపై కార్భన్ డేటింగ్ నిర్వహించాలని వారణాసి జిల్లా కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయవాది అప్పట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైనా వస్తువుపై కార్భన్ డేటింగ్ కానీ,.. సైంటిఫిక్ పరిశోధనలు కానీ జరిపితే అది పాక్షికంగా ధ్వంసం అయ్యే ప్రమాదముందని న్యాయవాది అభిప్రాయపడ్డారు. అదే విధంగా నాశనం అయితే తాము సుప్రీం కోర్టు ఆదేశాలను తాము ధిక్కరించినట్లే అవుతుందని తెలిపారు. గతంలో జ్ఞానవాపిలో వీడియోగ్రఫీ సర్వే జరిపినప్పుడు హిందూ ఆలయానికి సంబంధించిన గుర్తులు, శివలింగం లభించగా దాన్ని పూర్తిగా పరిరక్షించాలని సుప్రీం కోర్టు తన తీర్పులో వెల్లడించింది. సీజ్ చేసిన ప్రాంతాల్లోని వాటికి ఎటువంటి హాని జరగకుండా పరిరక్షించాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు తెలిపింది. దీన్నే వారణాసి కోర్టు కూడా ఉటంకించింది. శివలింగంపై కార్భన్ డేటింగ్‎కు అనుమతించడం ద్వారా అది ధ్వంసం అయితే సుప్రీం ఆదేశాలను ధిక్కరించినట్లు అవుతుందని పేర్కొంది.

    దీంతో పాటు ఒకవేళ అది శివలింగమే అయితే దాన్ని దాన్ని నాశనం చేయడం ద్వారా దేశంలోని హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్లు అవుతుందని జిల్లా న్యాయవాది తెలిపారు. ఇందుకోసమే ఆ శివలింగంపై కార్భన్ డేటింగ్‎కు అనుమతించడం లేదన్నారు. దీంతో పాటు ఈ తిరస్కరణ కేవలం కార్భన్ డేటింగ్‎కు మాత్రమే పరిమితమవుతుందని జ్ఞానవాపి మసీదు పిటిషన్‎పై ఇది ఎంతమాత్రం ప్రభావం చూపదని న్యాయవాది అన్నారు. అయితే తాజాగా అలహాబాద్ హైకోర్టులో వేసిన పిటిషన్‎పై విచారణ జరుపుతూ అటు ఆర్కియాలజీ డిపార్ట్‎మెంట్‎కు కూడా హైకోర్టు సలహా కోరింది. శివలింగంపై ఒకవేళ కార్భన్ డేటింగ్ లాంటి సైంటిఫిక్ పరిశోధనలు జరిపితే ధ్వంసం అయ్యే అవకాశం ఉంటుందో లేదో చెప్పాల్సిందిగా హైకోర్టు కోరింది.

    అయితే ఈ తీర్పుపై అప్పట్లో హిందూ సంఘాలు కానీ పిటిషనర్లు కానీ సంతృప్తి చెందలేదు. కార్భన్ డేటింగ్ జరిపినప్పుడు అది శివలింగం అని తేలితే ఇక తమకు తిరుగుండదని హిందూ సంఘాలు భావించాయి. ఇది నిరూపితమైతే జ్ఞానవాపి మసీదు పిటిషన్‎ను మరింత సులభంగా ఎదుర్కోవచ్చు అని భావించాయి. అయితే మరోవైపు మాత్రం శివలింగంపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రాచీన కాలంనాటి విగ్రహానికి ఏ చిన్న ప్రమాదం జరిగినా కూడా పూజించడానికి పనికిరాకుండా పోతుందని కేవలం కార్భన్ డేటింగ్ కోసం ఎంతో ప్రాశస్త్యం ఉన్న విగ్రహానికి హాని తలపెట్టడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు.

    అయితే తాజాగా అటు ఆర్కియాలజీ డిపార్ట్‎మెంట్ అభిప్రాయాన్ని కూడా హైకోర్టు కోరడంతో వారు చెప్పే అభిప్రాయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కార్భన్ డేటింగ్ సర్వేలో ఎటువంటి హాని జరగదని ఆర్కియాలజిస్టులు చెబితే ఈ సర్వే నిర్వహించడానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉంది. తదుపరి హైకోర్టు విచారణలో జరిగే వాదనల్లో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.

    Trending Stories

    Related Stories