More

    వరుడిది గుంటూరు.. వధువుది టర్కీ

    గుంటూరుకు చెందిన మధు సంకీర్త్, టర్కీకి చెందిన గిజెమ్ ను పెళ్లి చేసుకున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లిని ఘనంగా నిర్వహించారు. టర్కీకి చెందిన గిజెమ్ 2016లో ఓ ప్రాజెక్టు కోసం భారత్ వచ్చింది. ఆ సమయంలోనే మధు పరిచయమయ్యాడు. ఆ తర్వాత మధు కూడా ఉద్యోగ రీత్యా టర్కీ వెళ్ళాడు. ఇద్దరూ ఒకరి ఇష్టాలను మరొకరు తెలుసుకున్నారు. తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమే కాదని.. ప్రేమ అని గుర్తించారు. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

    ఈ విషయాన్ని ఇద్దరూ తమ తమ ఇళ్లల్లో చెప్పారు. వీళ్లిద్దరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించాయి. పెళ్లి సనాతన హిందూ సంప్రదాయం ప్రకారం చేసుకోడానికి పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. దీంతో ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. మధు సంకీర్త్ తల్లిదండ్రులు దమ్మాటి వెంకటేశ్వర్లు, గౌరీశంకరి. వారిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. మధు, గిజెమ్ ల నిశ్చితార్థం 2019లోనే జరిగింది. కరోనా వ్యాప్తి కారణంగా పెళ్లి ఆలస్యం అయింది. భారత్ లో హిందూ సంప్రదాయాల ప్రకారం ఒక్కటయ్యారు. ప్రస్తుతం మధు, గిజెమ్ ఆస్ట్రియాలో ఉద్యోగాలు చేస్తున్నారు. త్వరలోనే భారత్ కు తిరిగి రావాలని భావిస్తూ ఉన్నారు. ఈ ఏడాది జులైలో టర్కీలో అమ్మాయి తరఫు వారి సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

    Trending Stories

    Related Stories