More

    స్వీపర్ మేనేజింగ్ డైరెక్టర్ అయ్యాడు.. షాకింగ్ గా మనీలాండరింగ్ స్కెచ్

    వడోదర: నగరంలో కొన్నేళ్లుగా స్వీపర్‌గా పనిచేస్తున్న వ్యక్తి సరిగ్గా ఒక నెల క్రితం ఒక ప్రైవేట్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ అయ్యాడు. అంతేకాకుండా భారీ మొత్తంలో డబ్బు తీసుకోవడం మొదలుపెట్టాడు. దీంతో పోలీసులు అతని ఇంటి వద్దకు వచ్చినప్పుడు కంపెనీ ఎండీ చిన్న ఇంట్లో ఉండటాన్ని చూసి దర్యాప్తు అధికారులు సైతం అవాక్కయ్యారు. “దేశంలో ఒక ముఠా ఈ స్కామ్ అమలు చేస్తోందని మేము గ్రహించాము. అమాయక వ్యక్తులను మభ్యపెడుతున్నారని.. వారి గుర్తింపును ఉపయోగించి కోట్లాది రూపాయల మనీ లాండరింగ్‌కు ఉపయోగిస్తున్నారు. సైబర్ మోసాల ప్రపంచంలో ఇదొక కొత్త పద్ధతి” అని కేసు దర్యాప్తు చేస్తున్న ఏసీపీ (సైబర్ క్రైమ్) హార్దిక్ మకాడియా తెలిపారు.

    పెట్టుబడి పెడితే భారీగా రాబడిని అందజేస్తామని చెప్పి ప్రజలను మోసగిస్తూ వస్తున్నారు. వడోదరలోని సైబర్ క్రైమ్ ఈ కేసులో మనీలాండరింగ్ విషయంలో వివిధ రాష్ట్రాల్లో సృష్టించిన షెల్(డొల్ల) కంపెనీల వివరాలను పోలీసులు పొందారు. “మేము ఈ కంపెనీల సీనియర్ మేనేజ్‌మెంట్‌ను ట్రాక్ చేసాము. వారి చిరునామాలు ,ఇతర వివరాలను పొందాము” అని మకాడియా తెలిపారు.

    వివిధ సంస్థల్లోని దాదాపు రెండు డజన్ల మంది డైరెక్టర్లు లేదా సీఈవోల వివరాలను రాబట్టారు. సూత్రధారులను పట్టుకోవాలనే ఆశతో, సైబర్ క్రైమ్ స్లీత్‌లు కొంతమంది కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్లు, CEOల నివాసానికి చేరుకున్నప్పుడు స్వీపర్లు, వంట వ్యక్తులు, రోడ్డు పక్కన వ్యాపారులు కావడంతో వారు ఆశ్చర్యపోయారు. “ఈ వ్యక్తులు ప్రైవేట్ కంపెనీలలో ఉన్నత పదవులను నిర్వహిస్తున్నారని మేము వారికి చెప్పినప్పుడు ఆశ్చర్యపోయారు. వారిలో ఎవరికీ స్కామ్ గురించి తెలియదు లేదా వారి పేరు మీద తెరిచిన బ్యాంకు ఖాతాల గురించి వారికి తెలియదు, ”అని మకాడియా తెలిపారు.

    సైబర్ ఫ్రాడ్ ముఠా పని తీరును వివరిస్తూ.. ఇలాంటి నేపథ్యాల నుండి వచ్చిన చిన్నపాటి ఉద్యోగాలు చేసే వ్యక్తుల గుర్తింపు పత్రాలను స్వాధీనం చేసుకుంటాయని పోలీసులు తెలిపారు. “ఈ వ్యక్తుల పేర్లతో ప్రైవేట్ సంస్థలను సృష్టిస్తారు, కంపెనీని చట్టబద్ధంగా నమోదు చేసుకున్న తర్వాత, నిందితుడు వారి పేరు మీద కరెంట్ ఖాతాలను సృష్టిస్తాడు” అని పోలీసులు తెలిపారు. “పదుల సంఖ్యల్లోబ్యాంకు ఖాతాలు డబ్బును లాండరింగ్ చేయడానికి తెరవబడ్డాయి. మొత్తం డబ్బు ఒక బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది. దానిని క్రిప్టోకరెన్సీగా మార్చిన తర్వాత చైనాకు బదిలీ చేయబడుతుంది, ”అని మకాడియా వివరించారు.

    Trending Stories

    Related Stories