National

ఇప్పటికి మూడు సార్లు సింహం దాడిలో గాయపడ్డాడు.. అది కూడా అదే ప్రాంతంలో

అమ్రేలిలోని సావర్‌కుండ్ల తాలూకా అంబర్డి గ్రామంలో శనివారం ఓ యువకుడిపై సింహం దాడి చేసింది. భవేష్ భర్వాద్ అనే వ్యక్తి గ్రామ శివారులో పశువులను మేపుతుండగా అకస్మాత్తుగా సింహం అతనిపైకి దూకింది. అతడి ముఖం, చేతిపై గాయాలయ్యాయి. అక్కడి నుండి ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డాడు భవేష్. వెంటనే అంబులెన్స్‌లో అతడిని సావరకుండ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గట్టిగా కేకలు వేయడంతో సింహం అతనిని విడిచిపెట్టి, సమీపంలోని పొలాల్లోకి పారిపోయిందని స్థానికులు తెలిపారు.

భర్వాద్‌పై గత మూడేళ్లలో సింహం దాడి చేయడం ఇది మూడోసారని, అది కూడా అదే స్థలంలో జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అమ్రేలి జిల్లాలోని రెవెన్యూ (రక్షణ లేని) ప్రాంతాల్లో కనీసం 100 సింహాలు తిరుగుతున్నాయి. దాడులు చాలా అరుదుగా ఉన్నప్పటికీ, ఇటీవలి కాలంలో గ్రామాల్లోకి ఎక్కువగా ప్రవేశిస్తున్నాయి. పెంపుడు జంతువులపైనా.. పశువులపైనా దాడులు చేస్తున్నాయి.

Related Articles

Back to top button