తనను తానే పెళ్లి చేసుకోబోతున్న యువతి

0
969

గుజరాత్ లోని వడోదరకు చెందిన 24 ఏళ్ల క్షమాబిందు అనే అమ్మాయి తనను తానే పెళ్లి చేసుకోబోతోంది. క్షమాబిందు జూన్ 11న తనను తానే వివాహం చేసుకోనున్నట్లు పత్రికలను కూడా ప్రింట్ చేయించింది. క్షమా సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో సీనియర్ రిక్రూట్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. ఆమె తల్లిదండ్రులిద్దరూ ఇంజనీర్లు. ఆమె తండ్రి దక్షిణాఫ్రికాలో, తల్లి అహ్మదాబాద్‌లో ఉంటున్నారు. ఆమెకి తనంటే చాలా ఇష్టం, ఆమెకు మరెవరినీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో తనను తాను పెళ్లి చేసుకోవాలని ఆమె ఫిక్స్ అయింది. ఆమె సంప్రదాయబద్దంగానే చేసుకోవాలని నిర్ణయించుకుంది. హనీమూన్ కు గోవాకు వెళ్లే ఆలోచనలో ఉంది.

గుజరాత్ లో ఇదే తొలి స్వీయ వివాహం (సోలోగమీ) కానుంది. ‘వేరే ఎవరినీ పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు. అందుకే స్వీయ వివాహం.’ అని ఆమె చెబుతోంద. దీనికి సంబంధించి ఆన్ లైన్ లో వెతకగా.. దేశంలో ఏ మహిళ అయినా తనను తానే పెళ్లి చేసుకోలేదని తెలిసింది. క్ష‌మ పెళ్లికి స‌న్నాహాలు దాదాపు పూర్త‌య్యాయి. ఆమె పెళ్లి కోసం లెహెంగాను కూడా ఆర్డర్ చేసింది. పెళ్లి కార్డులను కూడా పంపిణీ చేసింది. వెడ్డింగ్ కార్డ్‌లో వరుడి పేరు లేదు, వధువు పేరు మాత్రమే ఉంది. త‌ల్లిదండ్రులు ఆమెను అర్థం చేసుకోవ‌డానికి టైమ్ తీసుకున్నా, ఆఖ‌రికి వారిద్దరూ ఆమె ఇష్టానికి ఒప్పుకున్నారు. క్షమా తన స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకోబోతోంది, ఆమె తల్లిదండ్రులు వీడియో కాల్ ద్వారా ఈ ఫంక్షన్స్ కు హాజరవుతారు.