More

    డిసెంబర్ 1, 5 తేదీల్లో పోలింగ్డిసెంబర్ 8న ఫలితాలుగుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

    గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. భారత ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. రెండు దశల్లో గుజరాత్ ఎన్నికలు జరుగుతాయని ఈసీ తెలియజేసింది. రాష్ట్రంలో డిసెంబర్ 1న తొలి విడత పోలింగ్ జరుగుతుందని, మలి విడత డిసెంబర్ 5న జరుగుతుందని తెలిపింది. డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేసింది. గత వారం మోర్బీలో వంతెన కూలి 135 మరణించిన విషాద సంఘటనపై ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపి, మృతుల కుటుంబీకులకు సానుభూతి తెలిపారు. అనంతరం గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ వివరాలు వెల్లడించారు.

    గుజరాత్‎లో మొత్తం 4 కోట్ల 90 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు. ఇందులో తొలిసారిగా ఓటు హక్కు పొందిన వారు 4 లక్షల 61 వేల మంది వున్నారు. మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 51,782 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఈసీ తెలిపింది. యువ ఓటర్లను ప్రేరేపించడానికి 33 ప్రత్యేక పోలింగ్ స్టేషన్లను అందుబాటులోకి తెస్తున్నామని, యువ పోలింగ్ సిబ్బంది ఈ పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తారని తెలియజేసింది. ఇదేకాకుండా 1274 పోలింగ్ స్టేషన్‌లను మహిళా పోలింగ్ సిబ్బంది నిర్వహిస్తారని తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో థర్డ్ జెండర్ ఓటర్ల భాగస్వామ్యాన్ని నిర్ధారించడంపైనా దృష్టి సారిస్తున్నట్టు ఈసీ పేర్కొంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు పదవీకాలం 2023 ఫిబ్రవరి 18న ముగుస్తుంది, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ పదవీకాలం జనవరి 8, 2023తో ముగుస్తుంది.

    హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీని సైతం పోల్ ప్యానెల్ ఈ నెల ప్రారంభంలో ప్రకటించింది. నవంబర్ 12 న రాష్ట్రంలో ఓటింగ్ జరుగుతుందని పేర్కొంది. అయితే, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించినప్పుడు, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, డిసెంబర్ 8 న ఒకే రోజు ప్రకటించనున్నట్టు ఈసీ వెల్లడించింది.

    ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రెండు రాష్ట్రాలు ఎన్నికల ఫలితాల తేదీని పంచుకోవడం ఇదే మొదటిసారి కాదు. 2017లో సైతం రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా ఎన్నికల తేదీలను ప్రకటించగా, డిసెంబర్ 18న ఒకరోజు కౌంటింగ్ జరిగింది.

    Trending Stories

    Related Stories