మోదీపై ఆప్ నేత ‘నీచపు’ మాట..! కేజ్రీవాల్.. ఇది విన్నావా..?

0
822

రాజకీయమంటే ఎంతో గొప్ప బాధ్యత. ప్రజలకు సేవ చేసేందుకు భారత రాజ్యాంగం కల్పించింది. అయితే ప్రజలతో పాటు రాజకీయ నాయకులు ఎంతటి హుందాతనం ప్రదర్శించాల్సిన అవసరముంది. కానీ రోజురోజుకీ రాజకీయ నాయకులు దిగజారిపోతున్నారు. తమ ప్రత్యర్థిని రాజకీయంగా ఎదుర్కోలేక చెడు అర్థాలతో విమర్శిస్తున్నారు. అత్యంత హీనమైన భాషను ఉపయోగించి రాజకీయాలకున్న గౌరవాన్ని హుందాతనాన్ని మసకబారుస్తున్నారు.

తాజాగా గుజరాత్ లో ఓ రాజకీయ నాయకుడు వినడానికి కూడా హేయకరమైన భాషను ఉపయోగించాడు. అయితే అదేదో చోటా మోటా నాయకుడంటే వదిలేయవచ్చు. కానీ అతడేదో చోటా మోటా నాయకుడు కాదు. దేశంలో రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆమాద్మీ పార్టీ కు రాష్ట్ర అధ్యక్షుడే ఇటువంటి వ్యాఖ్యలను చేయడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా.. వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో గోపాల్ ఇటాలియా దేశ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ని నీచ వ్యక్తిగా అభివర్ణించారు. అంతేకాదు తాను కూడా మాట్లాడలేని భాషను వాడుతూ ప్రధాని మోదీని ‘సీ’ అనే పదాన్ని పదేపదే ఉటంకించారు. ఈ వీడియో ఎప్పటిదో సరిగ్గా తెలియలేదు. కానీ ప్రస్తుతం ఈ వీడియోను బీజేపీ వర్గాలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి.

బీజేపీ సోషల్ మీడియా జాతీయ ఇంచార్జి అమిత్ మాలవీయ ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. గుజరాత్ నుండి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తిపై ఇటువంటి వ్యాఖ్యలు ఉపయోగించడం చాలా హేయకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీపై ఇటువంటి వ్యాఖ్యలు చేయడమంటే గుజరాతీయులను తీవ్రంగా అవమానించడమే అని దుయ్యబట్టారు. 27ఏళ్ళుగా తాము ఓటేసి గెలిపించుకున్న ప్రధానమంత్రిని ఆమాద్మీ పార్టీ నాయకులు ఈ విధంగా వ్యాఖ్యానించడం తమను అవమానించడమే అని విమర్శించారు.

అయితే కేజ్రీవాల్ పార్టీలో ఇటువంటి నాయకులు చేసే వ్యాఖ్యలు ఆ పార్టీ ఇమేజ్ ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఒక గొప్ప ఆశయంతో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ పార్టీ లోని నాయకులు ఒక్కొక్కరుగా అవినీతి ఆరోపణల్లో చిక్కుకుంటుండగా ఇప్పటికే ఆ పార్టీ పరువు పోతోంది. ఇక మిగిలిఉన్న కాస్తంత పరువును కూడా ఇటువంటి నాయకులు తమ మాటలతో శాంతం భూస్థాపితం చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ కు చుక్క లేనిదే పూట గడవదు అన్న ప్రచారం ఉంది. విదేశాల్లో సైతం ఈ ముఖ్యమంత్రిగారిని ఫ్లయిట్ నుండి తోసేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇతడిని సమర్థించే క్రమంలో ఓ గుజరాత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మందు ఆరోగ్యానికి మంచిదనే నీతి వాక్యాలు బోధించాడు. ఇతనికి తోడుగా ఇప్పుడు ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే మోదీపై నీచుడు అనే మాటలు మాట్లాడటంతో ఇన్నాళ్ళూ ఆమ్ ఆద్మీ పార్టీపై ఉన్న గౌరవం కూడా పోయే పరిస్థితికి చేరుకుంది. ఇప్పటికే మోదీ లాంటి గొప్ప వ్యక్తులను సీఎంగా చూసిన గుజరాత్ ప్రజలు గోపాల్ ఇటాలియా లాంటి వ్యక్తులు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న పార్టీని ఏమాత్రం అంగీకరిస్తారో కేజ్రీవాల్ కే తెలియాలి. ఇకనైనా కేజ్రీవాల్ తన పార్టీలోని ఇటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకుని కట్టడి చేస్తాడో లేక పార్టీ పరువును తీయడంలో తనవంతు పాత్ర కూడా వహిస్తాడో కాలమే నిర్ణయించాల్సి ఉంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

4 × 1 =