More

  పోలీసుల అదుపులో ఆప్ గుజరాత్ చీఫ్

  ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గుజరాత్ యూనిట్ చీఫ్ గోపాల్ ఇటాలియాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కించపరిచే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు గోపాల్ ను సరితా విహార్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.ప్రధానమంత్రిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వీడియోకు సంబంధించి ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్ (NCW) సమన్లు ​​జారీ చేసింది.

  గుజ‌రాత్ చీఫ్ గోపాల్ ఇతాలియ‌ను ఢిల్లీ పోలీసులు నిర్బంధంలోకి తీసుకుని స‌రితా విహార్ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారని తెలియగానే పెద్ద ఎత్తున ఆప్ కార్యకర్తలు స్థానిక పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప‌ట్ల అవ‌మాన‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన వీడియోకు సంబంధించి జాతీయ మ‌హిళా క‌మిష‌న్(ఎన్‌సీడ‌బ్ల్యూ) ఆప్ నేత‌కు స‌మ‌న్లు జారీ చేసింది. త‌న‌ను జైలులో పెడ‌తామ‌ని ఎన్‌సీడ‌బ్ల్యూ చీఫ్ హెచ్చ‌రిస్తోంద‌ని..ప‌టేల్ వ‌ర్గీయుల‌ను జైళ్ల‌లో నిర్బంధించ‌డం క‌న్నా మోదీ ప్ర‌భుత్వం ఇంకేం ఇస్తుంద‌ని ఆప్ నేత వ్యాఖ్యానించారు. ప‌టేల్ వ‌ర్గాన్ని బీజేపీ ద్వేషిస్తోంద‌ని, తాను స‌ర్ధార్ ప‌టేల్ సంత‌తికి చెందిన వాడిన‌ని, జైళ్ల‌కు భ‌య‌ప‌డ‌న‌ని అన్నారు.

  బీజేపీ ఐటీ సెల్ ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వియా ఆదివారం ఇటాలియా పోస్టు చేసిన వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. అందులో ఇటాలియా ప్రధాని మోదీని “నీచ్ ఆద్మీ” (నీచమైన వ్యక్తి) అని పిలవడం వినవచ్చు. ఈ వీడియో 2019 నాటిదని, సార్వత్రిక ఎన్నికల సమయంలోనిదని సమాచారం.

  Trending Stories

  Related Stories