More

    గూడూరు జంక్షన్: నవజీవన్ ఎక్స్ ప్రెస్ కు తప్పిన పెను ప్రమాదం

    అహ్మదాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న నవజీవన్ ఎక్స్‎ప్రెస్ కు పెద్ద ప్రమాదం తప్పింది. నవజీవన్ ఎక్స్‎ప్రెస్ రైల్‎లో మంటలు చెలరేగాయి. పాంట్రీకారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్‎లో మంటలను రైల్వే అధికారులు అదుపులోకి తీసుకువచ్చారు. సుమారు గంట పాటు గూడూరు రైల్వే స్టేషన్‎లో నవజీవన్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. రైల్వే వర్గాల అప్రమత్తంతో భారీ ప్రమాదం తప్పింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో రైల్వే అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

    ప్యాంట్రీ కార్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు రైలును గూడూరు రైల్వే స్టేషన్లో ఆపారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాదం కారణంగా రైలు సుమారు గంట పాటు గూడూరు రైల్వే స్టేషన్లో నిలిచిపోయింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. నవజీవన్ ఎక్స్ ప్రెస్ నిలిచిపోవడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

    Trending Stories

    Related Stories