National

బ్లాక్ ఫంగస్ మందులపై జీఎస్టీ లేదు: నిర్మలా సీతారామన్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన నేడు జీఎస్టీ మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆయా రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. జీఎస్టీ మండలిలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా చికిత్సకు ఉపయోగించే మూడు మందులకు, టెస్టింగ్ కిట్స్‌కు పన్ను మినహాయింపు ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్‌పై మాత్రం 5 శాతం జీఎస్టీ విధించారు. కరోనా మందులు, చికిత్సకు వాడే పరికరాలపై పన్ను తగ్గించారు.

అంబులెన్స్‌ సేవలపై 28 శాతం ఉన్న జీఎస్టీని 12 శాతానికి తగ్గించారు. టోసిలిజుమాబ్, యాంఫోటెరిసిన్ బి ఔషధాలపై పన్ను మినహాయింపు ఇచ్చారు. రెమ్‌డెసివిర్ ఔషధంపై జీఎస్టీ 12% నుంచి 5 శాతానికి తగ్గించారు. ఆక్సిజన్‌ యూనిట్లు, ఆక్సిజన్‌ ఉత్పత్తి యంత్రాలు, వెంటిలేటర్లు, ఇతర సంబంధిత పరికారాలపై జీఎస్టీ 12% నుంచి 5 శాతానికి తగ్గించారు. కోవిడ్ టెస్ట్ కిట్లు, యంత్రాలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. ఉష్ణోగ్రతలు లెక్కించే పరికరాలు, శానిటైజర్లపై జీఎస్టీ 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ఈ జీఎస్టీ తగ్గింపులు, మినహాయింపులు సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటాయని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. టోసిలిజుమాబ్, బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే ఆంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లపై జీఎస్టీ మినహాయింపు ఇచ్చారు.

థర్డ్ వేవ్ పొంచి వున్న నేపథ్యంలో కరోనా చికిత్సకు వినియోగించే వైద్యపరికరాలపై పన్ను రేటు తగ్గించాలని జీఎస్టీ కౌన్సిల్ భేటీలో పాల్గొన్న పలు రాష్ట్రాల మంత్రులు కేంద్రానికి విఙ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ భేటీలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరయ్యారు. కోవిడ్-19 వ్యాక్సిన్, ఔషధాలు, వైద్య పరికరాలపై పన్ను రద్దు లేదా పన్ను రేటు తగ్గించాలని పలు రాష్ట్రాలు జీఎస్టీ భేటీలో కేంద్రాన్ని కోరాయి. కోవిడ్ వ్యాక్సిన్ ను కేంద్రం త్వరగా పంపిణీ చేయాలని పలు రాష్ట్రాలు ఈ భేటీలో కోరాయి. అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని, అందుకోసం తక్షణమే చర్యలు ప్రారంభించాలని సూచించాయి. కోవిడ్ చికిత్సకు అవసరమైవ ఆక్సిజన్, ఆక్సీమీటర్లు, హ్యాండ్ శానిటైజర్లు, వెంటిలేటర్ సహా ఇతర వైద్య సామగ్రిపై పన్నుల విధింపుపై మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఫారసులకు మద్దతు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × 1 =

Back to top button