More

    గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు

    తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష సహా మరో రెండు పరీక్షలను రద్దు చేసింది. టీఎస్‌పీఎస్సీ నుంచి ఎగ్జామ్ పేపర్స్ లీక్ వ్యవహారం సంచలనంగా మారడంతో టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేయడంతో పాటు త్వరలో జరుగనున్న జూనియర్ లెక్చరర్ల పరీక్షలు వాయిదా వేసింది.

    టీఎస్పీఎస్సీ పేపర్​ లీక్​ ఘటనలో ప్రవీణ్ ​సహా మరో ఎనిమిది మంది నిందితులపై కేసులు నమోదయ్యాయి. మొత్తం తొమ్మిది మంది నిందితులకు మరో ఆరు రోజుల పోలీస్ కస్టడీ విధించారు. నిందితులను 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కు స్పందించిన కోర్టు 6 రోజుల కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది. ఇంకెన్ని పేపర్లు లీక్ చేశారన్న దానిపై నిందితులను విచారించనున్నారు. తొమ్మిది మంది నిందితులను ప్రస్తుతం చెంచల్ గుడా సెంట్రలో జైల్ కి తరలించారు.

    Trending Stories

    Related Stories