More

  గ్రూమింగ్ జిహాద్‌: జాహిద్ సలీమ్ కాస్తా రవిగా మారి హిందూ మహిళకి మాయమాటలు చెప్పి

  ఉత్తర ప్రదేశ్ లో గ్రూమింగ్ జిహాద్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఫరూకాబాద్‌కు చెందిన ఓ హిందూ వివాహిత మహిళ తన భర్త, అత్తమామలపై మోసం, వేధింపులు, దాడి చేసినట్లు ఆరోపిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. తన ఫిర్యాదులో, జాహిద్ సలీమ్ అనే యువకుడు తన మతాన్ని దాచిపెట్టి మోసం చేశాడని ఆరోపించింది. జాహిద్ సలీమ్ ‘రవి’గా నటిస్తూ హాస్పిటల్‌లో పనిచేస్తున్నప్పుడు తనను ట్రాప్ చేశాడని, ఆ తర్వాత మతం మార్చుకుని అతడిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడని ఆమె ఆరోపించింది. వివాహం తరువాత భర్త తన తల్లిదండ్రులతో కలిసి దాచుకున్న డబ్బులన్నీ లాగేశాడని.. ఆపై వేధించడం, కొట్టడం ప్రారంభించారని ఆమె తెలిపింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా, ఉత్తర ప్రదేశ్ పోలీసులు నిందితులు మరియు కుటుంబ సభ్యులపై దోపిడీ, హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు జాహిద్‌తో సహా నలుగురు వ్యక్తులపై కేసు నమోదైంది.

  బలవంతంగా మత మార్పిడి చేసినట్లు బాధితురాలి ఆరోపణలను కొత్వాలి పోలీసులు ఖండించారు. అయితే ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ వద్దకు వివిధ హిందూ సంఘాల సభ్యులు చేరుకున్నారు. నేరస్తుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జాహిద్ సలీమ్ ను పట్టుకోడానికి పోలీసులు అతడి ఇంటికి వెళ్లగా.. అప్పటికే అతను పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడి సోదరుడు జాహిద్ సలీమ్ ఆచూకీని వెల్లడించాడు. వెంటనే పోలీసులు జాహిద్ సలీమ్ అలియాస్ రవిని అరెస్ట్ చేశారు.

  విశ్వహిందూ పరిషత్ జిల్లా చీఫ్ దినేష్ సింగ్ తోమర్, హిందూ జాగరణ్ మంచ్ జిల్లా అధ్యక్షుడు సుబోధ్ మిశ్రాకు బాధితురాలు తన బాధను చెప్పుకొచ్చింది. జాహిద్ సలీమ్ అలియాస్ రవిని కలిసినప్పుడు తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని బాధితురాలు చెప్పింది. 2004 లో తన మొదటి భర్తను వివాహం చేసుకున్నానని, అతనితో ఇద్దరు కుమార్తెలు ఉన్నారని ఆమె చెప్పింది. ఆమె భర్త మానసికంగా సరిగా లేనందున మరియు వారికి ఆర్థిక సమస్యలు ఉన్నందున ఆమె ఆసుపత్రిలో పనిచేయడం ప్రారంభించింది. అక్కడ ఆమె 2015 లో నిందితుడిని కలుసుకుంది. జాహిద్ సలీమ్ మాయ మాటలు చెప్పి ఆమెకు దగ్గరయ్యాడు. జాహిద్ అసలు గుర్తింపు గురించి తనకు తెలియదని బాధితురాలు తెలిపింది. అతని వలలో పడిన మహిళ పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. అయితే జాహిద్ ఆ మహిళను కాయంగంజ్‌లోని మజార్‌కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను ఇస్లాం మతంలోకి మార్చాడు. అతను కొన్ని పేపర్‌లపై సంతకం చేయమని ఆమెను అడిగాడు. ఆ విధంగా ఆమెను జాహిద్ సలీమ్ వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత, ఆమె కల్మా (విధేయత యొక్క ఇస్లామిక్ ప్రమాణం) మరియు దారుల్ షరీఫ్ కూడా నేర్చుకోమన్నారు.

  బాధితురాలు హిందూ సంస్థల సభ్యులతో మాట్లాడుతూ.. నిందితుడు, వివాహం తర్వాత, ఆమె నుండి డబ్బును తీయడం ప్రారంభించాడు. ఆమె తండ్రి మరణించిన తర్వాత ఆమె అందుకున్న రూ.లక్షను అతను లాగేసుకున్నాడు. జూన్ 24, 2021 న, నిందితుడు తన కూతురి పేరు మీద చేసిన రూ .50 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) ను కూడా తీసుకెళ్లాడని ఆమె వాపోయింది. తన అత్తమామలు కూడా తనపై దాడి చేశారని బాధితురాలు తెలిపింది. జాహిద్ సలీమ్ కు బాధితురాలు విడాకులు ఇవ్వాలని జాహిద్ సలీమ్ తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇలా నిందితుడు పలువురిని ముగ్గులోకి దింపినట్లు తెలుస్తోంది. అతను మొదట బలహీనమైన హిందూ అమ్మాయిలను ఆకర్షిస్తాడని.. అలా చిక్కుకున్న వారిని ఇస్లాం స్వీకరించడానికి ఒప్పించి.. మతం మార్చాడని ఆమె ఆరోపించింది. బాధితురాలికి జాహిద్ ద్వారా ఒక బిడ్డ కూడా ఉన్నాడు.

  కొత్వాలి ఫరూకాబాద్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) స్వయంగా కేసును పర్యవేక్షించారు. ఈ విషయంపై దర్యాప్తు చేయమని నాగర్ కొత్వాలి పోలీసులను ఆదేశించారు.

  Trending Stories

  Related Stories